మసాజ్ సెంటర్ ముసుగులో హైటక్ వేశ్యవాటిక, పోలీసుల దగ్గరే రూ. ఆరు వేలు తీసుకుని!

Posted By:
Subscribe to Oneindia Telugu

పుదుచ్చేరి: నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే పుదుచ్చేరి నగరంలో మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. యువతుల అందాన్ని బట్టి రేటు ఫిక్స్ చేసి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఎస్పీ రాజీవ్ రాజన్ మీడియాకు చెప్పారు.

పుదుచ్చేరిలోని కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని లాడ్జ్ లు, మసాజ్ సెంటర్ల మీద నిఘా వేశారు.

ఓ మసాజ్ సెంటర్ లో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో మసాజ్ చేయించుకునే ముసుగులో వెళ్లారు. మఫ్టీలో ఉన్న పోలీసుల దగ్గర రూ. ఆరు వేలు తీసుకుని ఆరు మంది అమ్మాయిలను వారి ముందు నిలబెట్టారు.

Puducherry police bust prostitution racket

అంతే మహిళలు మఫ్టీలో ఉన్న పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. మఫ్టీలో ఉన్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బయట ఉన్న పోలీసులకు ఎస్ఎంఎస్ పంపించారు. పోలీసులు మసాజ్ సెంటర్ మీద దాడి చేశారు.

Prostitution should be legalized says Commission for Women

పుదుచ్చేరిలోని సామిపిళై తోటలో నివాసం ఉంటున్న శశి, తమిళ్ సెల్వి, లాస్పెట్ కు చెందిన గురుస్వామి, దిండివనంకు చెందిన కార్తిక్ అనే నలుగురిని అరెస్టు చేసి ఆరు మంది యువతులను రక్షించామని పోలీసులు చెప్పారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న ఆరోగ్య మేరి అలియాస్ రాధిక కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Puducherry police busted a prostitution racket which was operating under the guise of a massage parlour.
Please Wait while comments are loading...