హంపి ఉత్సవాలు: గుడిలో రష్యా యువతితో నగ్నంగా పూజారి రాసలీలలు, చితకబాదేశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దక్షిణ భారతదేశంలో హంపి ధార్మిక పుణ్యక్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందింది. హంపిలోని దేవాలయాలు, పరిసర ప్రాంతాలు చూడటానికి దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. అలాంటి ప్రసిద్ది చెందిన హంపి ఉత్సవాలు 2017 జరుగుతున్న సందర్బంలో పూజారి ఏకంగా గుడిలోనే రాసలీలలు సాగించాడు.

విదేశీ మహిళతో రాసలీలలు సాగిస్తున్న పూజారిని స్థానిక యువకులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకలోని హంపిలో కార్తీక మాసం సందర్బంగా ఘనంగా హంపి ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నారు.

Pujari was involved in sex with Russian young woman in hampi temple

శుక్రవారం రాత్రి రంగరంగ వైభవంగా హంపి ఉత్సవాలు జరగడంతో అందరూ ఉత్సవాల్లో నిమగ్నం అయ్యారు. హంపిలోని ఓ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న రాజరాజ మోహనదాస రష్యాకు చెందిన యువతిని పిలుచుకుని జనసంచారం తక్కువగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణంలోకి వెళ్లాడు.

తరువాత విదేశీ మహిళతో నగ్నంగా రాసలీలు సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న రాజశేఖర్ అనే యువకుడు విషయం గుర్తించి తన స్నేహితులతో కలిసి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణంలోకి వెళ్లారు. స్థానికులు వస్తున్నారని గుర్తించిన పూజారి, విదేశీ యువతి పారిపోవడానికి ప్రయత్నించారు.

స్థానిక యువకులు వెంటాడి హంపి ఉత్సవ వస్తు ప్రదర్శన జరుగుతున్న ప్రాంతంలో ఇద్దరినీ పట్టుకున్నారు. ఆలయంలోనే రాసలీలలు సాగిస్తున్న పూజారి రాజరాజ మోహనదాసకు దేహశుద్ది చేశారు. అయితే పూజారికి మద్దతు ఇచ్చిన కొందరు యువకులు రాజశేఖర్ తదితరుల మీద దాడి చేశారు. విషయం తెలుసుకుని అక్కడి చేరకున్న పోలీసులు పూజారి రాజరాజ మోహనదాసను అరెస్టు చేసి రష్యాకు చెందిన యువతిని విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pujari was involved in sex with Russian young woman in hampi temple in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి