ప్రముఖ నటి లైంగిక దాడి కేసు: మలయాళం నటి కావ్య మాధవన్ తో ప్రముఖ నిందితుడు ?
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ కు ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలు మొదలైనాయి.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ కు ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలు మొదలైనాయి. ఆయన భార్య (రెండో పెళ్లి) కావ్య మాధవన్ అరెస్టు అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రముఖ నటి లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రధాన నింధితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ మలయాళం హీరో దిలీప్ భార్య కావ్య మాధవన్ దగ్గర రెండు నెలల పాటు డ్రైవర్ గా పని చేశాడని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కావ్య మాధవన్ దగ్గర పల్సర్ సునీ పని చేస్తున్న సమయంలోనే ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చెయ్యాలని స్కెచ్ వేశారని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో కావ్య మాధవన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. మొత్తం మీద కావ్య మాధవన్, పల్సర్ సునీ మధ్య లింక్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications