ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియో

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య నలభై వరకు ఉంది. ఈ ఉగ్రదాడికి పాల్పడింది జైష్ ఏ మొహమ్మద్ తీవ్రవాది ఆదిల్ అహ్మద్ ధర్ అని పోలీసులు వెల్లడించారు. ఇతనికి మరో పేరు కూడా ఉందని చెప్పారు. ఆదిల్ అహ్మద్ గాడీ టక్రానేవాలా, గుండీబాగ్ వకాస్ కమాండో అని పిలుస్తుంటారు. సూసైడ్ బాంబ్‌గా దాడి చేయడతో ఇతను కూడా చనిపోయాడు.

ఉగ్రవాదులు తొలుత ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. కారులో బాంబు పేల్చారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ రాగానే ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. పేలుడు కోసం స్కార్పియోలో 350 పేజీల పేలుడు పదార్థాలను తరలించారు. ఈ పేలుడు పదార్థాలతో 40 మంది జవాన్లతో వెళ్తున్న బస్సును స్కార్పియోతో ఢీకొట్టారు.

Pulwama Terrorist Was Adil Ahmad Dar Who Joined Jaish Last Year: Cops

'నా పేరు ఆదిల్. నేను జైష్ ఏ మొహమ్మద్‌లో ఏడాది క్రితం చేరాను. నేను చేరిన ఏడాది తర్వాత నేను దేని కోసమైతే ఎదురు చూశానో ఆ అవకాశం వచ్చింది. దాడి చేసే అవకాశం వచ్చింది. ఈ వీడియో మీకు చేరే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను. ప్రజలకు ఇది నా చివరి సందేశం' అని సూసైడ్ బాంబర్ అయిన సదరు ఆదిల్ అహ్మద్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. అతను ఆ వీడియోలో జైష్ ఏ మొహమ్మద్ బ్యానర్స్ ఎదుట పేలుడు పదార్థాలతో నిలబడి ఉన్నాడు.

ఈ దాడికి కొన్ని నిమిషాల తర్వాత ఆదిల్‌ అహ్మద్‌ మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జైష్ ఏ మొహమ్మద్ జెండా ముందు ఆదిల్‌ ఆటోమెటిక్‌ రైఫిల్స్‌ను తగిలించుకుని కనిపిస్తాడు. మా మిలిటెంట్‌ కమాండర్లను కొంతమందిని చంపినంత మాత్రాన మేము బలహీనపడిపోతామని అనుకోవద్దని కూడా ఆదిల్ చెబుతాడు. ఆదిల్‌ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి. 2016, మార్చి 19 నుంచి ఆదిల్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు తౌసీఫ్‌, వసీమ్‌ కనిపించడం లేదని అక్కడి పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పేలుడు నేపథ్యంలో రేపటి పాట్నా పర్యటనను రాజ్ నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. రేపు (శుక్రవారం) శ్రీనగర్‌లో పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+