పుల్వామా అప్ డేట్స్ .. వీరుడా వందనం .. వీర జవాన్లకు భారతజాతి కన్నీటి నివాళి
న్యూఢిల్లీ : ఉగ్ర దాడితో ప్రాణాలొదిలిన 40 మంది జవాన్లకు భారతజాతి కన్నీటి వీడ్కోలు పలికింది. వీరుడా .. మరువదు నీ ప్రాణత్యాగం అంటూ నివాళులర్పించింది. వారి ధైర్య సాహసాలను నేతలు కొనియాడుతూ ... వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరువదు నీ త్యాగాన్ని ఈ జాతి ..
కనిపించని శత్రువు దాడితో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వీరులకు ఆయా చోట్ల ఆశ్రునివాళి అర్పించి ... అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో వీరజవాను ఆశ్వని కొచ్చి పార్థీవదేహానికి భారీగా స్థానికులు నివాళులర్పించారు. యూపీలోని మహరాజ్ గంజ్ లో జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. రాజస్థాన్ లో వీర జవాను రోహితష్ లాంబా పార్థీవదేహానికి స్వస్థలంలో జనం నీరాజనం పట్టారు. పాట్నా .. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హాకు ఆశేష జనవాహిని తుది వీడ్కోలు పలికారు. ప్రయాగారాజ్ .. కానిస్టేబుల్ మహేశ్ కుమార్ కు ఆశ్రునయనాలతో స్థానికులు వీడ్కోలు పలికారు.

అండగా మేమున్నాం ..
తమిళనాడులో వీరజవాను సీ శివచంద్రన్ పార్థీవదేహం వద్ద రక్షణమంత్రి నిర్మలా సీతరామన్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలకు మనం సంతాపం తెలుపాలని ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రదాడిలో ఆసువులు బాసిన జవాన్ల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
బయటపడిన నైజం
పుల్వామా దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తుంటే పాక్ మీడియా మాత్రం వితండవాదం చేస్తోంది. ఉగ్ర మూక ఆదిల్ ను వెనుకెసుకొచ్చింది. అంతేకాదు ఆయన చేసిన ఉన్మాదాన్ని పొగిడి తన నైజాన్ని బయటపెట్టుకుంది.

దాడిని నిరసిస్తూ ఆందోళన
దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళనకారులు రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లడంతో ఆందోళన నెలకొంది. నల్లసపోర రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకారుల నిరసన చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. కొందరు నిరసనకారులు రైల్వేట్రాక్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications