ఆన్‌లైన్లో ఐఫోన్ బుక్ చేస్తే చెక్కముక్కలు వచ్చాయి
పుణే: అన్‌లైన్‌లో ఐఫోన్ కొనుగోలు చేస్తే చెక్కముక్కలు వచ్చిన సంఘటన పుణేలో జరిగింది. ఇటీవలి కాలంలో ఈ-మార్కెట్ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. పలువురు ఆన్ లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వస్తువులకు బదులు ఇతర వస్తువులు వస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఆన్‌లైన్ పోర్టళ్ల ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువుల స్థానంలో రాళ్లు, చెక్కముక్కలు డెలివరీ అవుతున్న ఘటనలు అధికమవుతున్నాయి. పూణేకు చెందిన దర్శన్ కాబ్రా అనే వ్యక్తి స్నాప్ డీల్ ద్వారా రెండు ఐఫోన్లు (ఐఫోన్ 4ఎస్) బుక్ చేశాడు.

బుక్ చేసిన కొన్ని రోజుల తర్వాత అతని చిరునామాకు ఓ ప్యాక్ వచ్చింది. కాబ్రా దానిని విప్పి చూసి షాకయ్యాడు. అందులో ఐఫోన్‌కు బదులు చెక్కముక్కలు ఉన్నాయి. అప్పటికీ దానిని తీసుకు వచ్చిన డెలివరీ బాయ్ అక్కడే ఉన్నాడు.
క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఐఫోన్లును బుక్ చేశాడు. ఆర్డర్ ప్రకారం రెండు ఫోన్లకు కలిపి కాబ్రా రూ.40,508 చెల్లించవలసి ఉంది.
ఫోన్లకు బదులు చెక్కముక్కలు రావడంతో తాను నగదు చెల్లించనని స్నాప్ డీల్ డెలివరీ బాయ్‌కి చెప్పాడు. దీనిపై కాబ్రా స్పందించాడు. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో బుక్ చేయడంతో బతికిపోయానని చెప్పాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications