కాపాడమంటే వీడియో తీశాడు: ఇన్ఫోసిస్ రేప్ షాకింగ్

పుణే: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ పుణె ప్రాంగణంలో ఒక మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. లైంగిక దాడి ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ దుర్మార్గుడు తన పైన అత్యాచారానికి పాల్పడుతుండగా... తన అరుపులు విని అక్కడికి వచ్చిన మరో వ్యక్తి తనను రక్షించాల్సిందిపోయి, వికటాట్టహాసం చేసి మొత్తం దారుణాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడని ఆమె ఆరోపించింది.

ఇన్ఫోసిస్‌కు చెందిన పుణే ప్రాంగణంలోని క్యాంటిన్ క్యాషియర్‌గా పని చేస్తున్న యువతి సాయంత్రం వాష్ రూమ్‌కు వెళ్లగా అమెను అనుసరించిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసింది అక్కడ క్లీనర్‌గా పని చేస్తున్న పరితోశ్ బాగ్.

Pune Infosys Rape Survivor: Instead Of Saving Me, He Filmed My Rape

వాష్ రూంలోనే తనపై పరితోష్ చేస్తున్న దాడితో తాను గట్టిగా కేకలు వేశానని, అక్కడికి వచ్చిన ప్రకాశ్ మహాదిక్ తనను రక్షించే బదులు నవ్వేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ప్రకాశ్ వాష్ రూమ్ తలుపును లోపలి నుంచి గడియ పెట్టి, తన జేబులోని సెల్‌ఫోన్ తీసి మొత్తం దారుణాన్ని వీడియో తీశాడని తెలిపింది.

ఈ విషయాన్ని ఎక్కడైనా బయటకు చెబితే సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేసింది. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి సీఎమ్‌ సూర్యవన్శీ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 27న ఈ ఘోరం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+