ఎవరి పిచ్చి వారికి ఆనందం: బంగారంతో ఫేస్ మాస్క్.. టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా శంకర్

పూణే: ఒకొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ముంబైలో ఓ వ్యక్తి తను ఒంటిపై వేసుకునే దుస్తుల నుంచి ధరించే వస్తువుల వరకు అన్నీ బంగారంతోనే ఉండేలా చూసుకునేవాడు. ఎందుకంటే ఆయనకు ఆ స్తోమత ఉంది.. బంగారం పట్ల అతనికున్న ఇష్టం అలాంటిది. అందుకే ఆయన్ను గోల్డ్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. అయితే మన స్టోరీలో వ్యక్తి మాత్రం ఏకంగా మాస్కునే బంగారంతో చేయించుకున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు.. ఈ స్టోరీ ఏంటో చూద్దాం..

కరోనావైరస్ ప్రపంచంతో పాటు దేశాన్ని కబళిస్తుండటంతో జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. మాస్కులు లేక పోతే చిన్న టవల్స్ లేదా దుప్పటాలు ,లేదా చున్నీలు ముఖాలకు చుట్టేసుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పూణేలోని పింప్రీ - చించ్వాడ ప్రాంతంలో ఓ వ్యక్తి మాత్రం తన మాస్కును బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇప్పుడూ పూణే నగరంలో ఎవరూ చూసిన బంగారు మాస్కు ధరించిన శంకర్ కురాడే గురించే మాట్లాడుకుంటున్నారు. అసలే బంగారం ధర కొండెక్కి కూర్చున్న సమయంలో శంకర్ బంగారు మాస్కు ధరించడం పలువురు చర్చించుకుంటున్నారు.

Pune Man wears face mask made of Gold that costs about Rs.2.89 lakh

ప్రస్తుతం బంగారు మాస్కు ధరించిన శంకర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మాస్కు ధర అక్షరాల 2.89 లక్షలు. అయితే మాస్కు ధరిస్తే ఊపిరి ఎలా ఆడుతుందని మీకు డౌటు రావొచ్చు. మాస్కు ధరించినా ఊపిరి ఆడేందుకు చిన్న రంధ్రాలు ఉండేలా ముందే జాగ్రత్త తీసుకున్నాడు శంకర్. దీంతో శ్వాస తీసుకునే ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. అయితే ఈ బంగారంతో చేయించిన మాస్కు కరోనావైరస్ నుంచి తనను కాపాడుతుందా అనేదానిపై మాత్రం పూర్తి స్థాయి విశ్వాసం వ్యక్తం చేయడం లేదు.

Recommended Video

    Balbir Singh Sr, Triple Olympic Gold Medallist Hockey Legend Passes Away

    ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు చేరుకోగా 18వేలకు పైగా మృతి చెందారు. ఇక పూణే విషయానికొస్తే ఆ ఒక్క నగరంలోనే 6వేలు కోవిడ్-19 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 274 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+