ఊర్మిళపై ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు.. చివరకు ఏమైందంటే..!

పుణె : లోక్‌సభ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలున్నాయి. అదే క్రమంలో ముంబై నార్త్ నుంచి పోటీచేసిన సినీ నటి కమ్ పొలిటిషియన్ ఊర్మిళ మటోండ్కర్ కూడా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. ఆమెపై ప్రత్యర్థులు కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.

అదలావుంటే ఎన్నికలు అయిపోయాయి.. నేతల మధ్య పేలిన మాటల తూటాలు సమసిపోయాయి. కానీ ఓ వ్యక్తి ఊర్మిళపై చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చానీయాంశంగా మారాయి. చివరకు ఆయనపై పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం.

Pune Person arrested For Alleged Obscene Post On Actor Turned Politician Urmila Matondkar

ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఊర్మిళ.. బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. అయితే పుణేకు చెందిన ధనుంజయ్ కుదార్కర్ అనే 57 ఏళ్ల వ్యక్తి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ పెట్టాడట. ఆ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందడంతో సదరు వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని ఇంతవరకు అరెస్ట్ చేయనప్పటికీ దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+