Puneeth Rajkumar: పవర్ స్టార్‌తో టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఉన్న లింక్ ఏంటీ?
బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఈ మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు వందిత రాజ్‌కుమార్, ధృతి రాజ్‌కుమార్ ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

బాలనటుడిగా జాతీయ అవార్డు..
పునీత్ రాజ్‌కుమార్ ఇప్పటిదాకా 45 సినిమాల్లో నటించారు. ఇందులో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలు 13 ఉన్నాయి. జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డును సైతం అందుకున్నారాయన. బెట్టద హూవు సినిమాలో బాలనటుడిగా నటించారు. ఇందులో లోకేష్ అనే పాత్రలో జీవించారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ బాల నటుడి అవార్డు లభించింది. ఆ తరువాతా మూడు సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు. అక్కడితో బ్రేక్ వేశారు. 2002లో మళ్లీ పూర్తిస్థాయి హీరోగా తెరంగేట్రం చేశారు పునీత్ రాజ్‌కుమార్.

పునీత్‌ను పరిచయం చేసిన పూరీ
ఆ సినిమా పేరు అప్పు. దీనికి దర్శకుడు పూరీ జగన్నాథ్. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్‌ను పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు దక్కింది. ఈ అప్పు మూవీ.. మన తెలుగు సినిమా ఇడియట్‌కు రీమేక్. తెలుగులో ఇడియట్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. దాన్నే కన్నడలోకి రీమేక్ చేశారు. అందులో పునీత్ రాజ్‌కుమార్ నటించారు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ స్వయంగా.. పూరీ జగన్నాథ్‌కు ఫోన్ చేసి, ఈ మూవీని రీమేక్ చేయాలంటూ కోరారు.

సొంత బ్యానర్‌పై..
అలా పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా పునీత్ రాజ్‌కుమార్ కన్నడ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇందులోనూ రక్షిత హీరోయిన్‌గా నటించారు. పూర్ణిమా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమైంది. అది రాజ్‌కుమార్ సొంత ప్రొడక్షన్ హౌస్. పునీత్ రాజ్‌కుమార్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ ఈ సినిమాకు నిర్మాత. గురుకిరణ్ సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులోనే కాదు.. కన్నడలోనూ ఈ సినిమా ఎంత హిట్ అయిందంటే.. ఇప్పటికీ పునీత్ రాజ్‌కుమార్‌ను అందరూ అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ తరువాత పునీత్.. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ చాలా ఉన్నాయి.
Recommended Video

ప్లేబ్యాక్ సింగర్‌గా..
మిలానా, జాకీ, హుడుగరు, యారె కూగదలి, రణ విక్రమ, రాజకుమార, సినిమాలకు కర్ణాటక ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. పవర్ సినిమాలో గురువార సంజె అనే పాటను స్వయంగా ఆలపించారు. ఈ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు వరించింది. ఈ సినిమా మహేష్‌బాబు నటించిన దూకుడు సినిమాకు రీమేక్. రన్ ఆంటోనీ అనే సినిమాలో ఝనక్ ఝనక్ అనే పాటకు కూడా పునీత్‌కు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు లభించింది. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. కెవలుదారి, మాయాబజార్ 2016 వంటి సినిమాలను నిర్మించారు. కెవలుదారి.. తెలుగులో కపటధారిగా రీమేక్ అయిన విషయం తెలిసిందే.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications