Puneeth Rajkumar: జై భజరంగి టీమ్ కోసం: పవర్ స్టార్ చివరి మెసేజ్ ఇదే: ఆ మూడుగంటల్లోనే..!

బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

శాండల్‌వుడ్ శోకసంద్రం..

శాండల్‌వుడ్ శోకసంద్రం..

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికే.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంచినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయన మరణంతో శాండల్‌వుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమ పెద్దల దుఖ్ఖం కట్టలు తెంచుకుంది. తోటి నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు దిగ్బ్రాంతికి గురి అయ్యారు.

భజరంగికి సీక్వెల్..

భజరంగికి సీక్వెల్..

పునీత్ రాజ్‌కుమార్ అన్న.. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2 సినిమా విడుదల ఇవ్వాళే. తెలుగులో ఈ మూవీ జై భజరంగి పేరుతో విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో పాటు ఓవర్సీస్‌లో ఈ మూవీ విడుదలైంది. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు శివరాజ్ కుమార్ నటించిన సినిమా భజరంగి సూపర్, డూపర్ హిట్ అయింది. 2013లో విడుదలైన భజరంగి.. హయ్యెస్ట్ కలెక్షన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా భజరంగి 2ను తెరకెక్కించారు. భజరంగిని తెరకెక్కించిన హర్ష.. ఈ మూవీకీ దర్శకుడు.

భజరంగి 2 యూనిట్‌కు బెస్ట్ విషెస్..

ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన భజరంగి 2 సినిమా ఇవ్వాళే విడుదల కావడంతో.. చిత్రం యూనిట్‌ను అభినందించారు పునీత్ రాజ్‌కుమార్. బెస్ట్ విషెస్ తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. అదే ఆయన చివరి ట్వీట్. ఈ ఉదయం 11:30 గంటలకు పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు రాగా.. దానికి మూడు గంటల ముందు- అంటే ఉదయం 8:30 గంటలకు ట్వీట్ చేశారు పునీత్. ఆ ట్వీట్ కూడా జిమ్ నుంచే చేసినట్లు తెలుస్తోంది.

అదే చివరి ట్వీట్..

అదే చివరి ట్వీట్..

భజరంగి 2 చిత్రం యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్.. చివరిది. ఆ తరువాతే మరే ట్వీట్ కూడా చేయలేదు. 11:30 గంటలకు గుండెపోటుకు గురయ్యారు. తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. పునీత్ రాజ్‌కుమార్ చేసిన చివరి ట్వీట్‌కు అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. 35 వేల మంది కి పైగా లైక్ చేశారు. వేలాది రీట్వీట్లు, రిప్లైలు వచ్చాయి దీనికి. పునీత్ రాజ్‌కుమార్‌పై తమకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. దీనికి రిప్లై ఇచ్చారు వేలాదిమంది ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+