వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో ఆటో, ట్యాక్సీ ఓపెన్, సెలూన్లు కూడా, కండీషన్స్ అప్లై.. అక్కడ మాత్రం నో..

|
Google Oneindia TeluguNews

లాన్‌డౌన్ 4.0 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో లేదో.. పంజాబ్ రాష్ట్రం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజా రవాణాకు పర్మిషన్ ఇచ్చింది. కంటోన్మైంట్ జోన్లు కానీ చోట్ల ఆటో, ట్యాక్సీలు నడిపేందుకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు, రవాణాకు ఓకే చెప్పినా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోందని స్పష్టంచేసింది.

 లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రంజాన్ నెలలో హలీం కోసం అష్టకష్టాలు .. ధరలు పెంచి సీక్రెట్ గా అమ్మకాలు లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రంజాన్ నెలలో హలీం కోసం అష్టకష్టాలు .. ధరలు పెంచి సీక్రెట్ గా అమ్మకాలు

గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లలో క్యాబ్, టాక్సీ, కార్లు, ఆటోలలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులు వెళ్లాలని స్పష్టంచేసింది. మిగతా షాపులు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచేందుకు ఓకే చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సుముఖత వ్యక్తం చేసినా... కానీ ఆయా రాష్ట్రాలతో ముందుగా చర్చలు జరిపితేనే పర్యటనకు ఓకే అని తెలిపింది.

Punjab allows autos, taxis, intra-state buses in non-containment zones

Recommended Video

Women Cab Drivers Take Charge To Make Women Feel Safer ! || Oneindia Telugu

మంగళి షాపులు తెరవడానికి కూడా అంగీకరించింది. కానీ అక్కడ భౌతిక దూరం పాటించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సరతు విధించింది. స్పోర్ట్స్, కాంప్లెక్స్, స్టేడియాలు తెరిచేందుకు అభ్యంతరం తెలుపలేదు.. కానీ ప్రేక్షకులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పింది. సాధారణ సమయాల్లో కూడా 65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీలు, పదేళ్ల లోపు పిల్లలు ఇంటిలోపల ఉండాలని.. బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటిలాగే రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ మే 31వ తేదీ వరకు మూసివేస్తామని తేల్చిచెప్పింది.

English summary
Punjab has allowed the movement of cab aggregators, taxis and four wheelers. The state government has imposed restrictions on the number of persons that can travel in taxis, autos and rickshaws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X