ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని నలుగురు మృతి, 30 మందికి గాయాలు..

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి తీర్థయాత్ర స్కీమ్ లో భాగంగా నిర్వహిస్తున్న బస్సులు ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. పంజాబ్ లోని టార్న్ టారన్ జిల్లాలోని నేషనల్ హైవే 54 పై నౌషెహ్రా పన్నౌన్ గ్రామ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో 18 మంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. క్షతగాత్రులను వెంటనే టార్న్ టారన్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

వేగంగా వస్తున్న రెండు బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీ కొన్న నేపథ్యంలో రెండు బస్సుల్లో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దాంతో అనేక మంది యాత్రికులు బస్సుల్లోనే చిక్కుకున్నారు. ఇక ఇందులో ఓ బస్సు భగియారీ, లహిరీదాస్ గ్రామాల నుంచి ప్రయాణికులతో ఫరీద్ కోట్ కు బయల్దేరింది. మరో బస్సు లంబీ నియోజకవర్గంలోని భీడీవాల్ గ్రామం నుంచి అమృత్ సర్ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో స్కూటీ నడిపిన మహిళతోపాటు ఒక బస్సు డ్రైవర్‌, ఇద్దరు యాత్రికులతో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.

Punjab bus accident news now Horrific accident in Punjab Two buses collide four dead 30 injured

ఇక ఈ ప్రమాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎక్స్‌ పోస్ట్‌ లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+