చన్నీ మేనల్లుడికి ఇసుక మాఫియా నుంచి కోట్లు, ప్రభుత్వ అధికారుల బదిలీలు: ఈడీ

పంజాబ్‌‌ అసెంబ్లీ ఎన్నికలు వేళ కీలక పరిణామం చోటుచసుకుంది. పంజాబ్ సీఎం చరణ్‌జీత్‌ సింగ్ ఛన్నీ మేనల్లుడు భూపిందర్‌ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో నిన్న విచారించారు. ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కోర్టులో హాజరుపరుస్తారు.

ఈడీ చేసిన సోదాల్లో రూ.10 కోట్ల మేర అక్రమ నగదు, ఇతర పత్రాలు, నగలు, ఖరీదైన చేతి గడియారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిలో రూ.8 కోట్లు ఒక్క భూపిందర్‌ ఇల్లు, కార్యాలయాల్లోనే లభించినట్లు తెలిపింది. మిగతా సొమ్మును ఆయన సన్నిహితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈడీ సోదాలపై స్పందించిన చన్నీ.. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతేడాది పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ బంధువుల ఇళ్లలో ఈ తరహా తనిఖీలు జరిపారని అన్నారు.

Punjab CM Channis nephew made crores through sand mining, govt transfers:ED

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ఆ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ ఇసుక తవ్వకాలు ప్రధానాంశంగా మారింది. మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అందరూ భాగస్వాములేనని తెలిపారు. సీఎం నుంచి చెప్పుకుంటూ రావాలని ఆరోపించారు.

ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+