• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిల్లలతో హెలికాప్టర్‌లో పంజాబ్ సీఎం చన్నీ రైడ్.. డెవలప్ మెంట్ లక్ష్యం అని ప్రకటన

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికలు సమీపిస్తోన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను నేతలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీతోపాటు ఆప్ కూడా పాగా వేయాలని అనుకుంటున్నాయి. మరోవైపు సీఎం చరణ్‌జిత్ సింగ్ కూడా జనాలను అట్రాక్ట్ చేయడంపై ఫోకస్ చేశారు. చిన్న పిల్లలను మచ్చిక చేసుకుంటున్నారు. తనతోపాటు హెలికాప్టర్‌లో తీసుకెళ్లాడు.

పిల్లలతో సీఎం


మొరిండాలో పిల్లలు చరణ్ చాపర్ వద్ద ఆడుకున్నారు. అదీ చూసిన సీఎం చరణ్ జిత్ సింగ్ చూశారు. తన చిన్న తనం ఆయనకు గుర్తుకు వచ్చింది. తాను కూడా విమానం చూసి.. ఏదో ఒక రోజు అందులో కూర్చుంట అనుకునేవాడినని తెలిపారు. సో అలా ఆ చిన్నారులను తన వెంట తీసుకెళ్లనని.. వారు చాలా ఆనంద పడ్డారని పేర్కొన్నారు. వారి కల నెరవేరినందుకు తనకు కూడా చాలా హ్యాపీ అనిపించిందని వివరించారు.

నైపుణ్యం..

ఇక్కడ పిల్లలకు మంచి టాలెంట్ ఉందని.. కానీ వారిని సరయిన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్ చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం తాను పాటుపడతానని వివరించారు. చిల్ర్డన్ లైఫ్ కోసం పోరాడుతామని చెప్పారు. ప్రజల సంక్షేమమే తమకు ఇంపార్టెంట్ అని నొక్కి వక్కానించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నా.. తాము కలిసే ఉన్నామనే హింట్ ఇచ్చారు.

Jr NTR చిత్తశుద్ధిని శంకించే అర్హత ఉందా? | CBN Should Apologize JR NTR || Oneindia Telugu

ఇవీ సమీకరణాలు

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల వల్ల మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఆమ్ ఆద్మీ పార్టీపై పాలు చల్లినట్టయింది. ఇది కేజ్రీవాల్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారింది. అన్ని పార్టీలను చూసిన పంజాబ్ ఓటర్లలో అనేక మంది ఈసారి ఆప్ కు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. పరిస్థితులన్నీ ఇలాగే కొనసాగితే అరవింద్ కేజ్రీవాల్ మరో రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరెంతగా మారుతాయో వేచి చూడాలి. అయితే బీజేపీ కూడా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. శిరోమణి ఆకాళిదల్‌తో కలిసి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఇటు అమరీందర్ సింగ్ కూడా బరిలో ఉన్నారు. తన పార్టీతో ప్రజల్లోకి వచ్చారు. ఆయన కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీ, ఎస్ఏడీ, అమరీందర్ కలిసి పోటీలో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తోందని అంటున్నారు.

English summary
Punjab Chief Minister Charanjit Singh Channi on Sunday allowed a handful of children in Morinda to take a joyride in the Punjab government chopper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X