పెళ్లాం పోర్న్ టార్చర్.. రోజుకు 3 సార్లు నావల్ల కాదంటూ కోర్టుకెళ్లిన భర్త.. చివరికి!
Calling Husband Hijra: కలికాలం అంటే ఇదే మరి. నిత్యం పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఒక భార్య భర్తకు నరకం చూపించింది. రోజూ రాత్రికి మూడు సార్లు తన శారీరిక కోరికలు తీర్చాలంటూ డిమాండ్ చేసేది. అయితే రోజురోజుకూ భార్య ప్రవర్తతనతో విసిగిపోయిన భర్త ఏకంగా కోర్టును ఆశ్రయించటం వార్తల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం హర్యానాలోని మహేందర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఒక భార్యాభర్తల జంటకు సంబంధించినదే. వారికి 2017లో వివాహం జరిగింది. అత్తమామలు కింద ఇంట్లో ఉంటుండగా.. వీరు మెుదటి అంతస్తులో ఉండేవారు. అర్థరాత్రులు సైతం ఆరోగ్యం బాలేని అత్తగారితో ఆహారం తన రూముకు తెప్పించుకునేది ఈ కోడలు. దీనికి తోడు ఆమె పోర్న్ వీడియోలు చూడటానికి బానిసగా మారి 10-15 నిమిషాల పాటు సంభోగం చేయాలని డిమాండ్ చేసేది. రోజూ రాత్రుళ్లు మూడుసార్లు కలవాల్సిందేనని పట్టుబట్టేది. తనతో పోటీపడేందుకు అవసరమైన శారీరక దృఢత్వం లేదని తనకు మరో అబ్బానికి పెళ్లి చేసుకోవాలని ఉందంటూ భర్తకు చెబుతుండేది. అలాగే భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు అతడిని నపుంశకుడని పిలుస్తూ వెక్కిరించేది. తనకు కావలసినంత శారీరక సుఖం ఇవ్వలేకపోతున్నాడనేది.

ఈ క్రమంలో 2018లో భార్య కుటుంబం ఇకపై తనకు భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పారు. భరణం చెల్లించి విడాకులు తీసుకోవాలని వారు సూచించారు. ఈ విషయంపై పంచాయితీ కూడా పెట్టారు. ఈ క్రమంలో భార్య ఆత్మహత్య చేసుకుంటానని, మొత్తం కుటుంబాన్ని క్రిమినల్ కేసులో ఇరికిస్తానని బెదిరించింది. దీంతో ఆమె క్రూరత్వంతో విసిగిపోయిన భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ సమయంలో భార్య తన భర్త ఇంట్లో నుంచి గెంటేశాడంటూ రివర్స్ డ్రామా మెుదలెట్టింది. దీనికి తోడు అత్తమామలపై కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకును కోడలు హిజ్రా అని పిలిచేదని కోర్టుకు వెల్లడించింది. అలాగే దాదాపు 6 ఏళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తిరిగి కలిసే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. భర్తను 'హిజ్రా' అని పిలవడం మానసిక క్రూరమైన చర్యగా కోర్టు పేర్కొంది. భార్య దాఖలు చేసిన గృహహింస కేసును కూడా స్థానిక కోర్టు కొట్టివేసిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆమె విషయంలో ఎలాంటి గృహ హింస జరగలేదని గుర్తించింది. భార్య మొత్తం ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు జూలై 12న కుటుంబ న్యాయస్థానం భర్తకు అనుకూలంగా విడాకుల జారీ చేయటాన్ని సమర్థించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు న్యాయమూర్తులు.. భర్తను నపుంసకుడు అనడం దారుణమన్నారు. పైగా భార్య డిమాండ్లను తోచిపుచ్చుతూ భర్తకు అనుకూలంగా పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పును అందించింది.












Click it and Unblock the Notifications