Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ మంత్రికి కరోనా, కోడలికి కూడా.. స్వాతంత్ర్య వేడుకల మరునాడే..

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అంటుకుంటోంది. అయితే పంజాబ్ మంత్రికి కూడా కరోనా వైరస్ సోకింది. స్వాతంత్ర్య దినోత్సవం మరునాడే అతనికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. అతని కోడలికి కూడా వైరస్ సోకడంతో.. మంత్రిని కలిసిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు కోరారు.

విద్యుత్ పునరుత్పాదక మంత్రి గురుప్రీత్ కంగద్ కరోనా వైరస్ వచ్చింది. శనివారం మాన్సాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. జెండావిష్కరణ తర్వాత ఆయన కరోనా వైరస్ గురించి ప్రసంగించారు. మాస్క్ పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ తాను మాత్రం మాస్క్ ధరించలేదు. తర్వాత అతనికి వైరస్ సోకగా.. ఇంట్లో వారికి కూడా పరీక్షలు చేశారు. కోడలికి కూడా వైరస్ వచ్చింది. తనని కలిసిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.

Punjab Minister tests coronavirus positive, a day after independence Day..

ఇంతకుముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి త్రిప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా కూడా వైరస్ బారినపడ్డారు. రాష్ట్రంలో శనివారం 1033 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30 వేల 41కి చేరింది.

శనివారం 40 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 771కి చేరింది. లుధియానాలో 12 మంది, టార్న్ టారన్‌లో ఐదుగురు, ఫతేగడ్ సాహిబ్, పాటియాలా, సంగ్రూర్‌లో ముగ్గురు చొప్పున చనిపోయారు. అమృత్ సర్, కపుర్తాలా, ఫజిల్కా, జలందర్, మోగా, మొహలీలో ఇద్దరు చొప్పు, ఫరీద్ కోట్, పఠాన్ కోట్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+