Punjab Polls: రెండు స్థానాల నుంచి పంజాబ్ సీఎం పోటీ, ఓటమి తప్పదన్న కేజ్రీవాల్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, చమ్‌కౌర్ సాహిబ్‌తో పాటు బదౌర్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఎన్ఐ వెల్లడించింది.
Recommended Video
ఖీమ్ కరణ్ నుంచి సుఖ్‌పాల్ సింగ్ భులార్, బర్నాలా నుంచి మనీష్ బన్సాల్, పాటియాలా నుంచి విష్ణు శర్మ మూడవ జాబితాలో పేరున్న ఇతర అభ్యర్థులలో ఉన్నారు.

సీఎం చన్నీ ఓడిపోతారంటూ అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటేనే వారి పరిస్థితి అర్థమవుతోందన్నారు. అంతేగాక, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. చామకౌర్ సాహిబ్ నంచి పోటీ చేస్తున్న చన్నీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
Congress releases its third list of 8 candidates for Punjab Assembly elections
— ANI (@ANI) January 30, 2022
CM Charanjit Singh Channi to contest from Bhadaur constituency also. The party had earlier announced his candidature from Chamkaur Sahib seat pic.twitter.com/O7bPAWsS80
పంజాబ్‌లో ఫిబ్రవరి 20న (సోమవారం) ఒక దశలో ఓటింగ్ జరగనుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32% మంది షెడ్యూల్డ్ కులాల (SC) కమ్యూనిటీకి చెందిన చాలా మంది ప్రజలు సాధారణంగా గురు రవిదాస్ జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శిస్తారు కాబట్టి ఎన్నికల తేదీ ఫిబ్రవరి 14 నుంచి 20కి మార్చారు ఎన్నికల సంఘం అధికారులు.
గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు పంజాబ్ భక్తులు వారణాసిని సందర్శిస్తారు.
ఓట్ల లెక్కింపు మార్చి 10, 2022 (గురువారం) జరుగుతుంది.
పంజాబ్ శాసనసభ షెడ్యూల్:
1. నోటిఫికేషన్ తేదీ: 25 జనవరి 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2022 (మంగళవారం)
3. పరిశీలన తేదీ: 2 ఫిబ్రవరి 2022 (బుధవారం)
4. ఉపసంహరణ తేదీ: 4 ఫిబ్రవరి 2022 (శుక్రవారం)
5. పోల్ తేదీ: 20 ఫిబ్రవరి 2022 (ఆదివారం).












Click it and Unblock the Notifications