నెహ్రూ ఉన్న జైలు కుప్పకూలిపోయింది.. ఎక్కడో, ఎందుకో తెలుసా..?
జైటు : ఈశాన్య భారతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. మరోవైపు ఎగువన కురస్తోన్న వర్షాలతో వరదనీరు ఉప్పొంగుతుంది. దీంతో బీహర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ప్రజలే కాదు మూగజీవాల పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారింది. అయితే వర్షాల ధాటికి చారిత్రక కట్టడాలు కూడా కుంగిపోతున్నాయి. స్వాతంత్ర సమరంలో నెహ్రూ తదితర నేతలు ఉన్న జైటులోని జైలు గది కూడా కూలిపోయింది. అయితే దీనిపై అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. జైలు మరమ్మతులను పట్టించుకోలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
జైలులో నెహ్రూ..
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జవహర్ లాల్ నెహ్రూ, కే సంతానం, ఏటీ గిద్వానీతో కలిసి పంజాబ్‌లోని జైటు జైలులో ఉంచారు. వారు నిబంధనలను ఉల్లంఘించి నభా రాష్ట్రంలోకి ప్రవేశించారనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జైటు మోర్చా పేరుతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమమే చేపట్టింది. జైటు జైలుకు చారిత్రక నేపథ్యం ఉంది. ఓకే గోడ, పెద్ద రూప్‌తో 240 స్వ్కేర్ ఫీట్లతో జైలు ఉంది. అయితే ఈ జైలు శిథిలావస్థకు చేరిన పట్టించుకోలేదని స్థానిక అధికారులు చెప్తున్నారు. అందుకోసమే భారీ వర్షాలకు కుప్పకూలిపోయిందని సెలవిస్తున్నారు.

స్వాతంత్ర ఉద్యమ నాటి పరిస్థితుల్లో నెహ్రూ ఆయన సహచరులను నబా జైలుకు తరలించారు. అక్కడ వారి అభియోగాలను ఖరారు చేస్తూ రెండేళ్ల జైలు శిక్షను మేజిస్ట్రేట్ విధించారు. తర్వాత దేశ తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2008లో రాహుల్ గాంధీ నెహ్రూ ఉన్న జైలును పరిశీలించారు. జైలు కూలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. యూపీఏ హయాంలో రూ.65 లక్షలు జైలు కోసం కేటాయించామని పేర్కొన్నారు. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతుల కోసం నిధులు ఖర్చుచేయలేదని ఆరోపించింది. గత పదేళ్ల నుంచి జైలును పట్టించుకోకపోవడంతో క్రమంగా కూలిపోయిందని పేర్కొన్నది.












Click it and Unblock the Notifications