పఠాన్ కోట్ ఉగ్రదాడి: ఎస్పీ సింగ్ కీచకపర్వం

చండీగఢ్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై తాజాగా రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేరస్తుడు పలు ఆరోపణలు చేశాడు.

తనను కేసు నుంచి తప్పించాలంటే నా భార్యను అతనికి శారీరకంగా అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో పలువురు మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సల్వీందర్ సింగ్ మీద ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు ఓ రేప్ కేసులో నిందితుడి భార్యను లొంగదీసుకోవాలని ప్రయత్నించినట్లు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు సల్వీందర్ సింగ్ పై బుధవారం దర్యాప్తు చేస్తున్న అధికారులు కేసు నమోదు చేశారు.

బదిలీ అయ్యాడు

బదిలీ అయ్యాడు

ప్రస్తుతం సల్వీందర్ సింగ్ పంజాబ్ సాయుధ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని సల్వీందర్ సింగ్ ను ప్రొవిజన్ విభాగం ఐజీ ఆదేశించారు.

అరెస్టుకు రంగం సిద్దం

అరెస్టుకు రంగం సిద్దం

విచారణకు హాజరవుతున్న సల్వీందర్ సింగ్ ను అక్కడే అరెస్టు చేయ్యడానికి అవకాశం ఉందని ఉన్నత స్థాయి పోలీసు అధికారులు అంటున్నారు. శుక్రవారం (నేడు) సల్వీందర్ సింగ్ ఐజీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

నాభార్యపై లైంగిక దాడి....... రేప్ కేసు నిందితుడు

నాభార్యపై లైంగిక దాడి....... రేప్ కేసు నిందితుడు


రేప్ కేసులో నిందితుడు సల్వీందర్ సింగ్ పెట్టిన టార్చర్ తట్టుకోలేక పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు ఫిర్యాదు చేసి న్యాయం చెయ్యాలని వేడుకున్నాడు. ఎస్పీ సల్వీందర్ సింగ్ మీద ఆ బాధితుడు ఈ విధంగా ఫిర్యాదు చేశాడు.

రూ. 50 వేలు లంచం

రూ. 50 వేలు లంచం

రేప్ కేసు నుంచి తప్పించడానికి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడని, నిత్యం మా ఇంటికి వచ్చి నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితుడు ఆరోపించాడు.

నా భార్య మీద లైంగిక దాడి

నా భార్య మీద లైంగిక దాడి

ఓ రోజు మద్యం మత్తులో ఉన్న సల్వీందర్ సింగ్ తన భార్య మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని బాధితుడు చెప్పాడు.

వేధింపులు తట్టుకోలేక

వేధింపులు తట్టుకోలేక

ఎస్పీ వేధింపులు తట్టుకోలేక పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఎస్పీ సల్వీందర్ సింగ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదు చేసిన తరువాత మా మీద వేధింపులు ఎక్కువ అయ్యాయని వాపోయాడు.

కీచకపర్వాలు

కీచకపర్వాలు

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత సల్వీందర్ సింగ్ కీచకపర్వాలు అన్ని బయటకు వస్తున్నాయి. బాధితుడి భార్యతో సల్వీందర్ సింగ్ మాట్లాడి ఆడియో టేపులు, ఇతర ఆధారాలు పరిశీలించిన తరువాత అతను నేరం చేశాడని వెలుగు చూసిందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+