7 రూపాయల లాటరీ.. రాత్రికి రాత్రే తలరాత మార్చేసిన జాక్‌పాట్
అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. పిల్లల బట్టల కోసం బయటకు వెళ్లిన ఓ సాధారణ గృహిణికి లక్ష్మీ దేవి ఎదురైంది. కేవలం ఏడు రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్ ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. పంజాబ్‌లోని ఫరీద్కోట్ జిల్లా కోట్ కపురా ప్రాంతానికి చెందిన బిమ్లా దేవి అనే మహిళా పిల్లలకు కోసం షాపింగ్‌కు వెళ్లి రైల్వే రోడ్డులోని ఓ చిన్న లాటరీ దుకాణంలో రూ.7 తో లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.
మరుసటి రోజు సాయంత్రం ఫలితాలు వెలువడగా, షాప్ ఓనర్ నరేష్ మోంగా నేరుగా బిమ్లా దేవికి ఫోన్ చేసి జాక్‌పాట్ తగిలినట్లు శుభవార్త చెప్పారు. ఈ అద్భుత వార్త విన్న కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే బంధువులు, చుట్టుపక్కలవారంతా కలిసి ఆనందంతో చిందులు వేశారు. ఇరుగుపొరుగు వారికి మిఠాయిలు పంచడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

భగవంతుడు తన ప్రార్థనలను ఆలకించాడని బిమ్లా దేవి భావోద్వేగంతో తెలిపారు. వచ్చిన ఈ భారీ మొత్తంతో ముందుగా తన కొడుక్కి మంచి ఉద్యోగం ఇప్పించి, తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని ఆనందంగా వెల్లడించారు. ఈ విజయం ఆ కుటుంబానికి ఒక కొత్త జీవితాన్ని అందించింది.
లక్కీ స్టాల్ ఓనర్‌కు కూడా పండుగే
ఈ అదృష్టం కేవలం ఆ గృహిర్థికే కాదు, లాటరీ టికెట్ అమ్మిన దుకాణదారుడిని కూడా ఉత్సాహపరిచింది. గత ఆరు నెలలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్న నరేష్ మోంగా దుకాణంలో ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ భారీ విజయంతో ఆయన స్టాల్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది.














Click it and Unblock the Notifications
