వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కె నగర్: ఆధిపత్యం కోసం అన్నాడిఎంకె, పట్టుకోసం స్టాలిన్ ఇలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:వచ్చే నెలలో జరిగే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ బలాన్ని ప్రదర్శించాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉన్న పట్టును నిలుపుకోవాలని అన్నా డిఎంకె ప్రయత్నిస్తోంది.అయితే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాసంక్షేమ వేదిక కూడ బరిలోకి దిగనుంది.

ఏప్రిల్ 12వ, తేదిన జరిగే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలోని అదికార, విపక్ష పార్టీలకు మాత్రం ప్రధాన సవాల్ గా నిలిచాయి.

ఈ ఎన్నికల్లో తొలిసారిగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడ బరిలోకి దిగనున్నారు.దీపా ఎన్నికల్లో పోటీచేయడం కొంత అన్నాడిఎంకెకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు.

అయితే ఈ ఎన్నికల్లో డిఎంకె అన్నాడిఎంకె ఆధిపత్యానికి గండికొట్టాలని ప్రయత్నిస్తోంది.ఈ మేరకు డిఎంకె అన్నాడిఎంకె వ్యతిరేకశక్తులను ఐక్యం చేసే పనిలో పడింది.అయతే ఏ మేరకు ఈ విషయంలో డిఎంకె విజయం సాధిస్తోందో ఇప్పటికిప్పుడే చెప్పలేం.

దీపా జయకుమార్ పోటీ అన్నాడిఎంకె నష్టమేనా?

దీపా జయకుమార్ పోటీ అన్నాడిఎంకె నష్టమేనా?

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తానని దీపాజకుమార్ ప్రకటించారు.ఈ మేరకు గతంలోనే ఆమె ఓ దఫా ఆర్ కె నగర్ లో పర్యటించారు.అయితే ఆ సమయంలో దీపా జయకుమార్ కు జనం సానుకూలంగా స్పందించారు.శశికళ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేయాలని భావించినట్టుగా వార్తలు రావడంతో తామంతా దీప జయకుమార్ కు అండగా నిలుస్తామని ఆర్ కె నగర్ వాసులు ప్రకటించారు.అయితే ఈ పరిణామం ఆనాడు శశికళకు ఇబ్బందిగా మారింది.అయితే ప్రస్తుతం శశికళ జైలులో ఉంది. అయితే దీపా జయకుమార్ ఎన్నికల బరిలో నిలవడం అన్నాడిఎంకె కు నష్టం కల్గించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దినకరన్ ఆర్ కె నగర్ నుండి పోటీకి సిద్దం

దినకరన్ ఆర్ కె నగర్ నుండి పోటీకి సిద్దం

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె డిప్యూటీ జనర్ సెక్రటరీ దినకరన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.అయితే ఈ ఎన్నికల్లో దీపా జయకుమార్ పోటీచేయడం అన్నాడిఎంకెకు రాజకీయంగా కొంత ఇబ్బందికలిగించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

అన్నాడిఎంకె ఆధిపత్యానికి చెక్ పెట్టాలని డిఎంకె వ్యూహం

అన్నాడిఎంకె ఆధిపత్యానికి చెక్ పెట్టాలని డిఎంకె వ్యూహం

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానంలో అన్నాడిఎంకె ఆదిపత్యానికి చెక్ పెట్టాలని డిఎంకె బావిస్తోంది.ఈ మేరకు అన్నాడిఎంకె వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది డిఎంకె.ఈ మేరకు వామపక్ష పార్టీల నాయకులతో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని స్టాలిన్ వామపక్షాలను కోరారు.

డిఎండికె అభ్యర్థిగా మదివాసన్

డిఎండికె అభ్యర్థిగా మదివాసన్

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికె అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివాసన్ ను బరిలోకి దించే అవకాశం ఉంది.అయితే విజయకాత్ సతీమణి ప్రేమలతను కూడ ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది.అయితే మదివాసన్ వైపే విజయ్ కాంత్ మొగ్గుచూపారని ప్రచారం సాగుతోంది.

పన్నీర్ సెల్వం శిబిరం నుండి మాజీ డిజిపి

పన్నీర్ సెల్వం శిబిరం నుండి మాజీ డిజిపి

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నుండి మాజీ డిజిపి తిలకపతి పోటీచేసే అవకాశం ఉందని సెల్వం వర్గీయులు చెబుతున్నారు. అయితే ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ నాయకులు తలమునకలై ఉన్నారు.అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె అభ్యర్థిని ఓడించేందుకుగాను డిఎంకె తన శక్తియుక్తులన్నింటిని కూడదీసుకొనే ప్రయత్నం చేస్తోంది.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రజా సంక్షేమ వేదిక పోటీ

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రజా సంక్షేమ వేదిక పోటీ

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజా సంక్షేమ వేదిక కూడ పోటీచేసేందుకు సన్నద్దమౌతోంది.వామపక్షాలు ప్రజా సంక్షేమ వేదికగా ఏర్పడి పోటీచేయాలని నిర్ణయించుకొన్నాయి.అయితే డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ వామపక్ష పార్టీ నాయకులను కలిశారు.ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.

English summary
The People’s Welfare Front comprising the CPI, CPI (M) and the Viduthalai Chiruthaigal Katchi (VCK) has decided to contest in the by-election to the R.K. Nagar Assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X