పాకిస్థాన్ కు రక్షణగా రఫేల్ యుద్ధ విమానాలు.. ఛీ..ఛీ.. పరువు తీశారు కదరా..!!

భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదమే.. అందుకే దాయాది పాకిస్థాన్ తో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. భారత్ పై దాడులు చేసేందుకు పాక్ ప్రణాళికలు వేస్తూనే ఉంటుంది. దాంతో భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ వెళ్తోంది. ఇక గతేడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది భారత సైన్యం. దాంతో భారత్ శక్తిసామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలిసింది.

ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన ఆయుధాలు, క్షిపణులు, యుద్ధ విమానాలపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు పాకిస్థాన్.. చైనా, టర్కీ ఆయుధాలను వినియోగించి తీవ్రంగా నష్టపోయింది. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ను పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు నిలువునా ముంచేశాయి. ఇక తమకు చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 2.79 లక్షల కోట్లు కట్టాలని యూఏఈ డిమాండ్ చేస్తోంది. అప్పు తీర్చేందుకు గడువు కాలాన్ని పొడిగించాలని పాకిస్థాన్ ప్రాధేయపడినా యూఏఈ అందుకు అంగీకరించలేదు.

దాంతో చేసేదేం లేక ఇతర దేశాలపై పాకిస్థాన్ ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి అప్పు ఇచ్చేందుకు ఖతార్, సౌదీ అరేబియా ముందుకొచ్చాయి. అయితే ఖతార్ నుంచి ఆర్థిక సపోర్ట్ అలాగే దౌత్యపరమైన చర్చల కోసం ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఖతార్ వెళ్లారు. అయితే షరీఫ్ ప్రయాణించే విమానానికి ఎస్కార్ట్ గా రఫేల్ యుద్ధ విమానాల్ని పంపించింది ఖతార్. ఖతారీ ఎయిర్ స్పేస్ లోకి షరీఫ్ విమానం వచ్చిన తర్వాత ఖతార్ ఈ చర్యలు చేపట్టింది. ఇక తనకు ఎస్కార్ట్ గా రఫేల్ విమానాల్ని పంపడంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వకారణం అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను ఖతార్ ఇలాంటి పనులకు వాడటంపై నెటిజన్లు ఆ దేశంపై మండిపడుతున్నారు. పైగా భారత్ శత్రు దేశం అయిన పాకిస్థాన్ కు రక్షణగా రఫేల్ యుద్ధ విమానాలు పంపడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఖతార్ కావాలనే అలా చేసిందా..? లేక సెక్యూరిటీలో భాగంగా చేసిందా..? అనేది స్పష్టత లేదు. ఇక రఫేల్ ఫైటర్ జెట్స్ ను వినియోగిస్తున్న అతికొద్ది దేశాల్లో ఖతార్ ఒకటి. ప్రస్తుతం ఈ దేశం వద్ద 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి. 2015 లో ఖతార్ 24 రఫేల్ ఫైటర్ జెట్స్ ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత మరో 12 ను ఆర్డర్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాల్లో రఫేల్ ఒకటి. ఇవి F3R అడ్వాన్స్ డ్ వేరియంట్ ను కలిగి ఉన్నాయి. మోడ్రన్ రాడార్లు, వెపన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

Qatar Sends Rafale Fighter Jets to Escort Pakistan PM Shehbaz Sharif Faces Heavy Criticism Online

మరోవైపు పాకిస్థాన్ పైలట్స్ కు ఖతార్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ వ్యవస్థపై శిక్షణ కూడా ఇస్తున్నట్లు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉన్న మిలిటరీ కోఆపరేషన్ స్పష్టం అవుతోంది. ఇక అప్పు కోసం ఇప్పటికే సౌదీ అరేబియాలో పర్యటించారు షెహబాజ్ షరీఫ్. పాక్ కు దాదాపు 2 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సౌదీ అంగీకరించింది. తాజాగా ఇప్పుడు ఖతార్ లో పర్యటించారు షెహబాజ్ షరీఫ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+