‘క్వాడ్’ భారత వసుదైవ కుటుంబంకు పొడిగింపే: ప్రధాని మోడీ, ‘గ్రేట్ టూ సీయూ’ అంటూ జో బైడెన్
న్యూఢిల్లీ: భారత సాంప్రదాయక వైసుదైవ కుటుంబానికి క్వాడ్ సదస్సు పొడిగింపు అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. "భాగస్వామ్య విలువలను అభివృద్ధి చేయడానికి, లౌకిక, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను ప్రోత్సహించడానికి మేము మునుపటిలా కలిసి పనిచేస్తాము' అని ప్రధాని మోడీ అన్నారు.

ప్రపంచ మేలు కోరే బలమైన శక్తి క్వాడ్
శుక్రవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన క్వాడ్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్వాడ్ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచ మేలు కోరే బలమైన శక్తి ఈ క్వాడ్ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
క్వాడ్ మూల స్తంభంగా ఉంటుంది..
టీకాలు(వ్యాక్సిన్లు), వాతావరణ మార్పు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాలను ఈ రోజు మన ఎజెండా అంశాలు క్వాడ్‌ను ప్రపంచ మంచి కోసం శక్తిగా మారుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. క్వాడ్ ఎంతో ముందుకు సాగుతోందని అన్నారు. 'క్వా ఇప్పుడు ఈ ప్రాంతం స్థిరత్వానికి ఒక మూల స్తంభంగా ఉంటుంది' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
గ్రేట్ టూ సీయూ అంటూ మోడీపై జో బైడెన్
కాగా, క్వాడ్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీని కలుసుకోవడం సంతోషంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ అభివృద్ధికి వ్యాక్సినేషన్ పెంచడం కీలకమని జో బైడెన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్వాడ్.. ఇండో-పసిఫిక్ 21 వ శతాబ్దానికి రూపకల్పన చేస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ శ్రేయస్సు కోరేదే క్వాడ్..: స్కాట్ మోరిసన్
'ఇది ఇండో-పసిఫిక్.. ఇప్పుడు 21 వ శతాబ్దంలో ప్రపంచం విధిని రూపొందిస్తుంది. ఇండో-పసిఫిక్‌లోని నాలుగు గొప్ప ప్రజాస్వామ్య దేశాల నాయకులు, మా భాగస్వామ్యం ప్రపంచంలోని అనేక దేశాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు సహాయకుడిగా ఉంటుంది' అని ఆస్ట్రేలియా పిఎం స్కాట్ మోరిసన్ అన్నారు. కాగా, క్వాడ్ సదస్సులో భారత్ తోపాటు ప్రపంచ అగ్రదేశాలు పాల్గొనడంతో సామ్రాజ్యవాదంతో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా కొంత భయాందోళనలకు గురవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ క్వాడ్ కూటమి దేశాల మధ్య పరస్పరం సహకారం కోసమే దృష్టిపెట్టాలి కానీ, ఇతరులను లక్ష్యం చేసుకోవడం, వారి ప్రయోజనాలను దెబ్బతీయడం సరికాదని చైనా పేర్కొంది.












Click it and Unblock the Notifications