గుజరాత్‌లో భూకంపం.. 5 తీవ్రతతో ప్రకంపనాలు
ఇటీవల దేశంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. తీవ్రత తక్కువగానే ఉన్నా.. వరసగా భూమి కంపిస్తోంది. ఈ మధ్య జగిత్యాల జిల్లాలో పలు చోట్ల భూకంపం సంభవించింన సంగతి తెలిసిందే. ఇవాళ గుజరాత్‌లో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వారంతా భయాందోళనకు గురయ్యారు.

Recommended Video
మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల సమయంలో కొద్ది క్షణాల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5గా ఉంది. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప ప్రభావంతో జనం భయపడ్డారు. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ మాత్రం టెన్షన్‌కు గురయ్యారు.
ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా కనిపించిందని.. పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
అసోంలో కూడా గురువారం ఉదయం భూకంపం వచ్చింది. తేజ్‌పూర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయ్యింది.












Click it and Unblock the Notifications