• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి క్షణంలో ప్రశ్నలు తొలగింపు: జాబితాలో లేని కేసీ వేణుగోపాల్ 2 ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ శీతకాల సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. తొలి రోజు వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినా.. చర్చకు అవకాశం ఇవ్వలేనని ప్రతిపక్షాలు చిందులేశాయి. అయితే రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నను తుది జాబితా నుంచి ప్రభుత్వం తీసివేసింది. దీనిపై ప్రతిపక్షాలు గుర్రుమంటున్నాయి. విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు ఎయిర్ పోర్టుల వద్ద వేధింపులకు గురవుతున్నారా..? వారిని వెనక్కి తీసుకొస్తున్నారా అని.. రైతు ఆందోళనలకు సాయం చేయొద్దు అని కొందరు అంటున్నారా అని ప్రశ్నను వేణుగోపాల్ అడగగా.. డిసెంబర్ 2వ తేదీన సమాధానం చెబుతామని కేంద్రం తొలుత చెప్పింది. కానీ దానిని తర్వాత జాబితా నుంచి తొలగించింది.

వేధింపులా..?

వేధింపులా..?

విదేశాల్లో ఎంతమంది ఎన్ఆర్ఐలు ఉంటున్నారు. ఎయిర్ పోర్టుల వద్ద ఎందరు ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని తిరిగి స్వదేశం తీసుకువచ్చారా అని అడిగారు. దీనికి సంబంధించి గత మూడేళ్లుగా జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి సమాదానం ఇవ్వాలని కోరారు.

వారిలో కొందరు రైతులు చేపడుతున్న నిరసనలకు మద్దతు ఇవ్వం అని చెప్పారా అని అడిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని వేణుగోపాల్ ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సోమవారం విదేశాంగ శాఖ సమాధానం ఇవ్వలేదు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు సమయం కేటాయించిన సంగతి తెలిసిందే.

ఉంచి.. చివర తీసేశారు..

ఉంచి.. చివర తీసేశారు..

వేణుగోపాల్ ప్రభుత్వానికి పంపించిన ప్రశ్నలకు సంబంధించి నవంబర్ 29వ తేదీ వరకు సమాధానం ఉంటుందని తొలుత సమాచారం అందింది. అయితే తర్వాత 26వ తేదీన ఆ ప్రశ్నలు ఫైనల్ లిస్టులో చేర్చలేదు. ఇదివరకు అయితే సమాధానం చెప్పకపోవడానికి కారణం చెప్పేవారు అని వేణుగోపాల్ గుర్తుచేశారు.

కానీ ఈ సారి అలా జరగలేదన్నారు. ఇదే కాదు జలియాన్ వాలా బాగ్‌ ఉదంతానికి సంబంధించిన మరో ప్రశ్నను కూడా జాబితాలో చేర్చలేదని వివరించారు. ఓ సభ్యుడిగా తాను ప్రశ్న అడిగి.. సమాధానం తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇదీ ఏం జాతి వ్యతిరేక చర్య కాదని చెప్పారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిసోందని పైరయ్యారు. సభ్యుల హక్కును ప్రభుత్వం అణగదొక్కుతుందని మండిపడ్డారు.

Recommended Video

Parliament Winter Session 2021 : No Debates - New Model Of Democracy || Oneindia Telugu
చర్చకు వచ్చేవి ఇవే..

చర్చకు వచ్చేవి ఇవే..

ప్రయాణంపై ఆంక్షలు సడలింపు, తైవాన్‌తో సంబంధాల బలోపేతం, ఐక్యరాజ్యసమితిలో హిందీ అధికార బాష్య, భారత్ ఆప్ఘనిస్తాన్ సంబంధాలు, వ్యాక్సినేషన్, రూరల్, సెమీ అర్బన్ ఏరియాలో పాస్ పోర్టు సేవా కేంద్రాల ఏర్పాటు, విదేశాల్లో ఉన్న వారికి వేతన తగ్గింపు అంశం, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ, ఎన్సీజీలో చేరిక అంశంపై చర్చ, శ్రీలంకలో తమిళుల మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చ.. ఈ అంశాలు చర్చించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

English summary
Congress Rajya Sabha member K C Venugopal to the Minister of External Affairs on whether NRIs living abroad were harassed at airports and sent back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X