హాట్ భామకు కరెంటు బిల్లు షాక్..

అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ భామ రాయ్ లక్ష్మీకి కరెంట్ అధికారులు నెల నెలా షాక్ ఇస్తున్నారట. ఎడాపెడా కరెంటు బిల్లు వేస్తూ చుక్కలు చూపిస్తున్నారట. తాను కట్టిన బిల్లుకు తర్వాత నెలలో రెట్టింపు బిల్లు వస్తుండటాన్ని గమనించిన రాయ్‌లక్ష్మీ ఆ విషయాన్ని ఎలక్ట్రిసిటీ బోర్డ్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే అది ఫలితం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో చివరకు సోషల్ మీడియా వేదికగా రాయ్ లక్ష్మీ తన గోడు వెళ్లబోసుకుంది.

గత కొన్ని నెలలుగా రాయ్ లక్ష్మీ ఇంటి కరెంటు బిల్లు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందట. ఈ నెల ఎంత బిల్ కడితే మరుసటి నెల అంతకు డబుల్ బిల్ వస్తోందట. ఇలా మూడు నెలలుగా జరుగుతుండటంతో కంప్లైంట్ చేసేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం దక్కలేదట. తనలా ఇంకాఎంత మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో తలుచుకుంటేనే ఆశ్చర్యమేస్తోందని, ఈ ప్రాబ్లెం నుంచి తనను ఎవరైనా గట్టెక్కించండని రాయ్ లక్ష్మీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా కట్టాలంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.

Raai Laxmi Have A Problem With Electricity Bill

సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ చేసిన పోస్టు చూసి ఆదానీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పింది. రాయ్ లక్ష్మీ పూర్తి వివరాలు పంపితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ఆమె చేసిన ట్వీట్‌కు బదులిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+