చిన్న గౌను వేసుకున్న రాధే మా (ఫోటోలు)
ముంబై: స్వయం ఘోషిత దైవ మానులవుల జాబితాలో ఉన్న మాత రాధే మా మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. కురుచటి స్కర్ట్ లు వేసుకుని అసభ్యంగా ఫోజు ఇచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి. చిన్నా చితకా వ్యక్తులు వీటిని విడుదల చెయ్యలేదు.
ఒకప్పటి ప్రముఖ బీజేపీ నాయకుడు దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ సోషల్ మీడియా ద్వార ఈ ఫోటోలను బయటి ప్రపంచానికి చూపించారు. నాసిక్ కుంభమేళ నుండి బిల్డర్ బాబా, మాత రాధే మా నిషేదం ఎదుర్కోన్న విషయం తెలిసిందే.

బిల్డర్ బాబా సచ్చిదానంద గిరి మీద అక్రమంగా మద్యం విక్రయించారనే కేసుతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అదే విధంగా రాధే మా మీద వరకట్నం వేదింపుల కేసు ఇప్పటికే నమోదు అయ్యింది.
ఇప్పుడు రాధే మా మిని స్కర్ట్ లు వేసుకుని అసభ్యంగా ఫోటోలకు ఫోజు ఇచ్చిందని వెలుగు చూసింది. అంతే కాకుండా రాధే మా పలు బాలివుడ్ సినిమా పాటలకు అసభ్యంగా డ్యాన్స్ లు వేసిందని ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి.
Guess who ???? pic.twitter.com/KOg8EFJCGB
— Rahul Mahajan (@TheRahulMahajan) August 5, 2015 నిక్కి గుప్తా అనే మహిళ తన అత్త నిత్యం తనను వరకట్న తీసుకురావాలని వేదిస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అత్తకు రాధే మా సహాయం చేస్తున్నదని, ఆమె రెచ్చగొడుతున్నదని, పెళ్లి సమయంలో రూ. 102 కోట్ల విలువైన బంగారు నగలు ఇచ్చామని నిక్కి గుప్తా కేసు పెట్టింది. రాధే మా మీద నిక్కి గుప్తా కేసు పెట్టింది.












Click it and Unblock the Notifications