రాధే మా సైట్ హ్యాక్, మగాళ్లతో ఆలింగనం ఫోటోలు! రాఖీ సావంత్ మద్దతు

ముంబై: తన పైన వచ్చిన ఆరోపణల పైన రాధే మా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనకు ఎవరి పైన ఫిర్యాదులు లేవన్నారు. ఆమె ఓ ఆంగ్ల న్యూస్ టీవి ఛానల్‌తో మాట్లాడారు.

తన పట్ల ఎవరైతే రావణుడిలా ప్రవర్తిస్తున్నారో వారికి వారే నాశనం అవుతారని ఆగ్రహించారు. సత్యమేవ జయతే అన్నారు. ఎవరైతే సమాజం కోసం జీవిస్తారో... వారికి దేవుడు విజయం అందేలా చేస్తాడని చెప్పారు.

రాధే మా వెబ్ సైట్ హ్యాక్

రాధే మా అధికారిక వెబ్ సైట్ శనివారం నాడు హ్యాక్ అయింది. వెబ్ సైట్‌ను హ్యాక్ చేసిన ఆ వ్యక్తి ఆమె మినీ స్కర్టులో ఉన్న కొన్ని ఫోటోలను అప్ లోడ్ చేశాడు. దాంతో పాటు ఇద్దరు మగాళ్లను ఆలింగనం చేసుకున్న ఫోటోలు దర్శనమిచ్చాయి.

Radhe Maa's website hacked, her photos in miniskirt posted

రాధే మా అమాయక ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సంత్యా హక్సర్ పేరుతో ఆ హ్యాకర్ పోస్ట్ చేశాడు. కాసేపటికి నిర్వాహకులు దానిని తొలగించారు. శనివారం వెబ్ సైట్ హ్యాక్ అయిందని, రాధే మా పైన ద్వేషంతో జరిగిందని చారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్త సంజీవ్ తెలిపారు.

బాలీవుడ్లో మిశ్రమ స్పందన

రాధే మా బాగోతం పైన బాలీవుడ్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. రాధే మా ఎంతో మంచి వ్యక్తి అని బాలీవుడ్ సీనియర్ డైరక్టర్ సుభాష్ ఘాయ్ అన్నారు. ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

నేను, మా ఆవిడ ముక్తా.. మాతా విష్ణుదేవి భక్తులమని, గతేడాది రాధే మా భక్తులు బోరివాలి భవన్లో నిర్వహించిన మాతా కి చౌకి కార్యక్రమానికి హాజరయ్యామని, అప్పటి నుంచి మేం కూడా రాధే మా భక్తులుగా మారామన్నారు.

ఓసారి మా నివాసంలో నిర్వహించిన మాతా కి చౌకి కార్యక్రమానికి రాధే మా వచ్చారన్నారు. మాతో ఎంతో ఆప్యాయంగా మసలుకునేవారన్నారు. నన్ను, ముక్తాను తల్లిదండ్రులుగా భావించేవారని, ఆమె అసభ్యంగా ప్రవర్తించడం గానీ, తప్పుగా మాట్లాడడం గానీ ఎప్పుడూ గమనించలేదన్నారు.

ఆమెపై వార్తలు రావడం బాధాకరమన్నారు. ఆమెకు భజనలు, భక్తిగీతాలంటే ఎంతో ఇష్టమన్నారు. భక్తుల ముందు చిన్నపిల్లలా నర్తించేవారని, భక్తులను తన పిల్లల్లా భావిస్తారని, విదేశాలకు వెళుతుంటానని, షాపింగ్ చేయడం ఇష్టపడతానని, అన్నింటికీ మించి, ఓ సాధారణ అమ్మాయిలా ఉండడాన్ని ఇష్టపడతానని మాతో చెప్పారని, త్వరలోనే ఆమె ఈ సంక్షోభం నుంచి బయటపడతారని ఆశిస్తున్నానని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

రాఖీ సావంత్ కూడా రాధే మాకు మద్దతుగా నిలిచారు. రాధే మాను నేను ఎంతగానో గౌరవిస్తానని, ఆమె తనలో శక్తిని నింపారన్నారు. రాధే మాకు రాఖీ సావంత్ మద్దతు పలకడంపై ఓ ట్వీట్‌లో ఒకరు ఎద్దేవా చేశారు. ఐటం సాంగ్స్ చేసే రాఖీ సావంత్‌కు మినీ స్కర్ట్స్ వేసుకున్న రాధే మా ఆదర్శం కావడంలో ఆశ్చర్యం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+