Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
Tennis Player Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకేసులో ఆమె బెస్ట్ ఫ్రెండ్ హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ మరోసారి సంచలన విషయాలు వెల్లడించారు. రాధికా హత్యకు 3 రోజుల ముందు నుంచి ప్రణాళిక జరిగిందని, హత్య జరిగిన తీరుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే రాధికా సోదరుడు హిమాన్షికా వాదనలను ఖండించాడు.
3 రోజుల ముందే హత్యకు పథకం!
హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ విడుదల చేసిన వీడియోలో.. రాధికా యాదవ్ తండ్రి దీపక్ యాదవ్ హత్యకు 3 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. రాధిక యాదవ్ మరణవార్త విని షాక్‌కు గురైనట్లు ఆమె తెలిపారు. హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. "నేను ఆమె ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ 3 రోజుల ముందు నుంచే ప్లాన్ జరిగిందని నాకు తెలిసింది. జులై 10న నా స్నేహితురాలు ఒకరు నాకు కాల్ చేసింది. అయితే నేను ఆ కాల్ ఎత్తలేదు. అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో రాధికా యాదవ్ హత్య చేయబడిందని.. ఆమె తండ్రే ఆమెను కాల్చి చంపారని రాసి ఉంది. దీని తర్వాత నేను రాధికా యాదవ్ నంబర్‌కు కాల్ చేశాను.కానీ ఆమె కాల్ ఎత్తకపోవడంతో నాకు అర్థమైపోయింది. ఆ సమయంలో నా కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది." అని హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ వెల్లడించారు.

హత్యకు కారణం స్నేహితుల ప్రభావమా?
హత్య జరిగిన తీరును హిమాన్షికా వివరిస్తూ.. "తండ్రి తల్లిని మరో గదిలో ఉంచాడు. ప్లాన్ ప్రకారం సోదరుడిని ఎక్కడికో పంపాడు. రాధికా పెంపుడు కుక్క లూనాను కూడా దూరంగా ఉంచారు. అవకాశం చూసి ఆమె తండ్రి ఆమెను వెనుక నుండి కాల్చి చంపాడు. 5 బుల్లెట్లు ఏ తండ్రి కొడతాడు?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాధికాపై ఆంక్షలు విధించారని, కుటుంబం చాలా ఆర్థోడాక్స్ అని గతంలోనే హిమాన్షికా వెల్లడించారు. రాధికా తండ్రి దీపక్ యాదవ్ తన నలుగురు స్నేహితుల ప్రభావంతోనే ఈ చర్యకు పాల్పడ్డాడని హిమాన్షికా ఆరోపించారు. దీపక్ స్నేహితులు తరచుగా రాధికా విజయం పట్ల అసూయపడేవారని, "రాధికా పొట్టి దుస్తులు వేసుకుంటోంది, మేకప్ వేసుకుంటోంది. నువ్వు ఆమె డబ్బుతో బతుకుతున్నావు" అని దీపక్‌తో చెప్పేవారని హిమాన్షికా పేర్కొన్నారు. రాధికా సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేసేది కాదని, ఆమె ఖాతా ప్రైవేట్‌గా ఉందని, కేవలం 68 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని హిమాన్షికా స్పష్టం చేశారు.
ఖండించిన రాధికా యాదవ్ సోదరుడు
టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్యపై ఆమె సోదరుడు కూడా కీలక విషయాలను వెల్లడించాడు. తండ్రి దీపక్ యాదవ్‌ను ఎవరూ ఎప్పుడూ నిందించలేదని.. ఇంట్లో బంధించి ఉంచారన్న అతను పూర్తిగా ఖండించాడు. అలాగే హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలను కూడా నిరాధారమైనవిగా పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications