Radhika Yadav: రీల్స్, తండ్రి అభద్రతా భావం.. టెన్నిస్ క్రీడాకారిణి హత్యకు కారణాలివే!
Radhika Yadav: హర్యానాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ తన తండ్రి దీపక్ యాదవ్ చేతుల్లో దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్న తండ్రే కూతురిని తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో దారుణంగా కాల్చి చంపేశాడు.పోలీసులు తండ్రి దీపక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం ఇష్టం లేకనే హత్యకు పాల్పడినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. అయితే ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం, ఆమె ఆదాయంపై ఆధారపడటం పట్ల అతని అభద్రతాభావం వంటి ఇతర కారణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రాధిక యాదవ్ కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం.
అసలేం జరిగిందంటే?
గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో 25 ఏళ్ల వయసున్న రాధికా యాదవ్ అనే మాజీ జూనియర్ టెన్నిస్ క్రీడాకారిణి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. రాధిక జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. గురువారం ఉదయం రాధిక యాదవ్ తన ఇంట్రో బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుండగా.. ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె మెడకు తగలగా.. రెండు బుల్లెట్లు వెనుక భాగంలో తగిలాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దీపక్ ను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం ఆమె తండ్రికి ఇష్టం లేకపోవడమే ఈ హత్యకు కారణమని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. దీంతో పాటు ఆయన సొంతూరికి వెళ్లినప్పుడల్లా కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గూ శరం లేదని అని జనాలు సూటిపోటి మాటలతో దెప్పి పొడిచారు. తన కూతురి వ్యక్తిత్వాన్ని కూడా తప్పుబట్టారు. ఈ పరిణామాలన్నీ కూతురిపై కోపాన్ని పెంచాయి.

రాధిక హత్యకు దారి తీసిన కారణాలు
ప్రాథమిక విచారణ ప్రకారం.. దీపక్, రాధికల మధ్య ఆమె ఒక టెన్నిస్ అకాడమీ నడపడంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీపక్ యాదవ్ టెన్నిస్ కోచింగ్ ఆపమని కోరినట్లు.. అయినా రాధిక వినలేదని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ హత్యలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది. రీల్స్ కూడా చేసేది. కూతురిపై పగతో రగిలిపోతున్న తండ్రి దీపక్.. కూతురికి సంబంధించి ఒక మ్యూజిక్ వీడియో కూడా నెట్ లో రావడం చూశాడు. ఆ వీడియోలో రాధిక ఓ యువకుడికి ప్రియురాలిగా నటించింది. ఆ వీడియోలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండటంతో కూతురిని తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. వీడియోలు చేయొద్దని చెప్పినా వినకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
ఆసక్తికరంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. దీపక్ గతంలో పాత గురుగ్రామ్‌లో "డీప్ యాక్సెసరీస్" అనే కార్ల విడిభాగాల దుకాణాన్ని కలిగి ఉన్నాడు. దానిని తర్వాత మూసివేశాడు. అతనికి అద్దె ఆదాయం కూడా ఉంది. రాధిక సోదరుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. రాధిక టెన్నిస్ కెరీర్ కోసం దీపక్ చాలా కష్టపడ్డాడని స్థానికులు వెల్లడించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని తండ్రి ఎలా చంపాడని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.
రాధిక యాదవ్ గురించి..
మార్చి 23, 2000న జన్మించిన రాధిక యాదవ్ ఒక మంచి టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITF) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నవంబర్ 4, 2024 నాటికి 113వ స్థానంతో కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించింది. హర్యానా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో స్థానంలో ఉంది. ఆమె స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పట్టభద్రురాలైంది. 2018లో తన 12వ తరగతి కామర్స్ పరీక్షలలో ఉత్తీర్ణురాలైంది. చిన్నతనం నుండే ఆమెకు టెన్నిస్ పట్ల మక్కువ పెరిగింది.
🚨HORRIFIC
— BALA (@erbmjha) July 10, 2025
- State level tennis player Radhika Yadav was shot dead by his father Deepak Yadav in Gurugram.
- He was furious because she ran a tennis academy.
- She was shot in the back while cooking through a licensed pistol.
- Fired 5 bullets, 3 hit her
This is Kalyug 💔 pic.twitter.com/GmwNAPQtQS
-
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications