లేఖ రాసినా.. సోనియాకు సొంతవాళ్లే షాక్: ఢిల్లీ వర్సిటీ అమ్మాయిలా..!
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. 2012లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 26 స్థానాలు గెలుచుకుంది. ఈసారి సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేసినా ఏడు స్థానాలు మించలేదు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. 2012లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 26 స్థానాలు గెలుచుకుంది. ఈసారి సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేసినా ఏడు స్థానాలు మించలేదు.
స్వయంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీలలోను కాంగ్రెస్ దెబ్బతిన్నది. అమేథిలో నాలుగింట ఒక్కచోట కూడా గెలవలేదు.

రాయ్ బరేలీలో ఆరు స్థానాల్లో కేవలం రెండింట మాత్రమే గెలిచింది. మొత్తం పది స్థానాల్లో ఆరు బీజేపీ గెలిచింది. ఎన్నికల్లో గెలిపించాలని సోనియా రాయ్ బరేలీ, అమేథీ ప్రజలకు లేఖ కూడా రాశారు.
నన్ను మోడీ ఓడించలేదు.. రాహుల్ వల్లే: అఖిలేష్‌పై సెటైర్లు
యూపీలో ప్రధాని మోడీ హవా కారణంగా అధికార ఎస్పీ సైకిల్‌కు పంక్చర్ పడగా, కాంగ్రెస్ హస్తానికి అక్కడి ఓటర్లు చేయిచ్చారు. సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.
ప్రత్యేకించి ట్విటర్లో రాహుల్ గాంధీపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గురుమెహర్ కౌర్ వ్యాఖ్యలు మొదలు... సారీ చెబుతున్న చిన్నపిల్లాడి మాదిరి ఫొటోల వరకు ట్విట్ల జోక్స్ పేల్చేందుకు ఉపయోగించుకున్నారు.
ముఖ్యమంత్రి అఖిలేవ్ యాదవ్ ఓటమి పాలవ్వడానికి పార్టీ కుమ్ములాటలు ఒక ఎత్తయితే, రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం మరో కారణమని నెటిజన్లు తేల్చేశారు.
గురుమెహర్ కౌర్ స్థానంలో అఖిలేశ్ ఫోటో పెట్టి.. 'మోడీ నన్ను ఓడించలేదు... ఆ పని చేసింది రాహులే' అని సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది. ఇదే ఫోటోలో రాహుల్ గాంధీ, కేజ్రివాల్ ఫోటోలు కూడా పెట్టి కామెంట్లు గుప్పిస్తున్నారు.
'సారి డాడీ' అని అఖిలేశ్ అంటే 'సారీ మమ్మీ' అని రాహుల్ పోస్టర్లు పట్టుకున్నట్టు కనిపిస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు. 'పంక్చర్ పడిన సైకిల్‌ని రాహుల్ ఇప్పుడెలా నడిపిస్తాడో'నని కామెంట్ చేస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications