Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాఫెల్ రభస: రాఫెల్ ఒప్పందంలో తెరపైకి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు

Recommended Video

    రాఫెల్ డీల్ : రాబర్ట్ వాద్రా పై సంచలన వ్యాఖ్యలు చేసిన గజేంద్ర సింగ్ షెకావత్

    ఢిల్లీ: రాఫెల్ డీల్ వ్యవహారం రాజకీయపార్టీలను కుదిపేస్తోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే రాఫెల్ వ్యవహారం రోజుకో మలుపుతీసుకుంటుంది. మొన్న రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదిచిందని చెప్పి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే సంచలన ప్రకటన చేసి భారత ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేశాడు. అంతలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన మోడీ సర్కార్.. డీల్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన స్నేహితుడు వ్యాపారవేత్త సంజయ్ భండారీకి రాఫెల్ డీల్ కుదుర్చేలా ప్లాన్ చేశారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

    సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తన మిత్రుడు సంజయ్ భండారీకి రాఫెల్ ఒప్పందం దక్కించుకునేలా విశ్వప్రయత్నాలు చేశారంటూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబర్ట్ వాద్రా సంజయ్ భండారీలను మధ్యవర్తులుగా ఉపయోగించుకునేందుకు రాఫెల్ కొనుగోలు ఒప్పందం సందర్భంగా నాటి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. అది సాధ్యం కాలేదు కాబట్టే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై బురద జల్లుతోందని అన్నారు. ఎన్డీఏ సర్కారుకు అవినీతి మకిలి అంటించే ప్రయత్నం చేస్తోందని షెకావత్ మండిపడ్డారు. అంతేకాదు వాద్ర, భండారీలు మంచి మిత్రులని పలు డిఫెన్స్ ఎక్స్‌పో వేదికలపై ఇద్దరూ కలిసి కనిపించారని షెకావత్ అన్నారు.

    Rafale deal row: Robert vadra name surfaces in the fresh allegations made by BJP

    ఇదిలా ఉంటే రాఫెల్ డీల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అందుకు ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదని విశ్వసనీయ సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల కోసమే రాజకీయంగా లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ రాఫెల్ డీల్‌ను పట్టుకుని వేలాడుతోందని... ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌ను కలిసి రాఫెల్ ఒప్పందంపై జరిగిన అవినీతిపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ కోరిన కొద్ది గంటలకే రాబర్ట్ వాద్ర అతని స్నేహితుడు భండారీల పేర్లు తెరపైకి రావడం విశేషం. అంతకుముందు కాగ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతిపై రిపోర్ట్ తయారు చేసి పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలని కోరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+