Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను సిద్ధం: నటి రమ్యకు రాగిని ద్వివేది ఆఫర్, పిలిస్తేనే

బెంగళూరు: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు హీరోయిన్లకు దాదాపు పడదనే చెప్పవచ్చు. అయితే శాండిల్ వుడ్ క్వీన్, మాండ్య కాంగ్రెసు లోకసభ అభ్యర్థి రమ్య, మరో నటి రాగిని ద్వివేది విషయంలో మాత్రం అది అవాస్తవం కానుందట. రాగిని ద్వివేది, రమ్యలు త్వరలో చేతులు కలపనున్నట్లుగా కర్నాటక రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది.

రమ్య, రాగిని ద్వివేదిలు శాండిల్ వుడ్ హీరోయిన్లు. వారు ఏ సినిమాలను కలిసి నటించలేదు. అంతేకాదు వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు రమ్య, రాగిని ద్వివేదిలు చేతులు కలపనున్నారట. అయితే, వారు సినిమాలో కలిసి నటించడం లేదు!

రమ్య మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాగిని ద్వివేది త్వరలో రమ్య తరఫున మాండ్యలో ప్రచారం చేయనున్నారట. ఈ విషయాన్ని రాగిని స్వయంగా చెప్పారట. రమ్య తన తరఫున ప్రచారం చేయమని తనను కోరితే తాను సిద్ధమని రాగిని చెప్పారట.

రాగిని - రమ్య

రాగిని - రమ్య

రమ్య తనను ఆహ్వానిస్తే తాను ఆమె తరఫున పోటీ చేసేందుకు సిద్ధమని రాగిని ద్వివేది ప్రకటించారట. అయితే, రాగిని చెప్పిన అంశం పైనా రమ్య స్పందించాల్సి ఉంది.

రాగిని - రమ్య

రాగిని - రమ్య

సినీ పరిశ్రమకు చెందిన వారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తే తాను మద్దతిస్తానని శాండిల్ వుడ్ హీరోయిన్ రాగిని ద్వివేది చెబుతున్నారట.

రాగిని - రమ్య

రాగిని - రమ్య

తాను సినీ పరిశ్రమకు చెందిన వారికి మాత్రమే మద్దతిస్తానని రాగిగిని ద్వివేది చెబుతున్నారు. తాను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని, కేవలం పరిశ్రమకు చెందిన వారు అయినందువల్లే మద్దతు అంటున్నారు.

రాగిని - రమ్య

రాగిని - రమ్య

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న సినీ పరిశ్రమకు చెందిన వారికి మద్దతిస్తానని చెబుతున్న రాగిని ద్వివేది... నటుడు శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ తరఫున షిమోగాలో ప్రచారానికి సిద్ధమంటున్నారు.

రాగిని - రమ్య

రాగిని - రమ్య

సినీ ప్రముఖులకు మద్దతిస్తానని చెబుతున్న రాగిని ద్వివేదిని.. తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రశ్నిస్తే... తాను సినిమాలతో బిజీగా ఉన్నానని, ప్రస్తుతానికి తన రాజకీయాల పైన ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+