
పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ప్రకటించిన రాహుల్: చిరునవ్వుతో సిద్ధూ!
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు.
కాగా, పంజాబ్‌కు కాంగ్రెస్ మొదటి 'దళిత సీఎం అయిన చన్నీ, రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆదివారం లూథియానాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో సీఎం అభ్యర్థిన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీకి సమర్థులైన నాయకుల కొరత లేదని తేల్చిచెప్పారు.

ఈ నిర్ణయంపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. 'రాహుల్ గాంధీ నిర్ణయాన్ని నేను అంగీకరించాను.. నాకు నిర్ణయాధికారం ఇస్తే మాఫియాను అంతం చేస్తాను, ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాను, అధికారం ఇవ్వకపోతే.. మీరు ఎవరిని సీఎం చేసినా చిరునవ్వుతో కలిసి నేను నడుస్తాను' అని వ్యాఖ్యానించారు.
Charanjit Singh Channi will be the Congress' chief ministerial candidate for the upcoming Punjab Assembly elections: Rahul Gandhi in Ludhiana pic.twitter.com/KW0aQ8wcpT
— ANI (@ANI) February 6, 2022
కాంగ్రెస్‌లో
పార్టీ
సీఎం
అభ్యర్థిపై
నిరంతరం
గొడవలు
జరుగుతుండగా,
ఈ
పదవికి
నవజ్యోత్
సింగ్
సిద్ధూ,
చరణ్‌జిత్
సింగ్
చన్నీలు
ప్రధాన
పోటీదారులుగా
ఉన్నారు.
ఈ
నిర్ణయానికి
ముందు,
పంజాబ్
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
చీఫ్,
నవజ్యోత్
సింగ్
సిద్ధూ
ట్వీట్
చేస్తూ,
"నిర్ణయం
లేకుండా
గొప్పది
ఏమీ
సాధించలేం...
పంజాబ్‌కు
క్లారిటీ
ఇవ్వడానికి
వచ్చిన
మా
లీడింగ్
లైట్
రాహుల్
జీకి
హృదయపూర్వక
స్వాగతం....
ఆయన
నిర్ణయానికి
అందరూ
కట్టుబడి
ఉంటారు!!!"
అని
వ్యాఖ్యానించారు.
#WATCH | I have accepted Rahul Gandhi's decision...if I am given decision-making power, I will finish the mafia, improve people's lives. If not given power, I will walk with a smile with whomever you make CM: Punjab Congress president Navjot Singh Sidhu in Ludhiana pic.twitter.com/pS71BUBkhW
— ANI (@ANI) February 6, 2022
రాహుల్ గాంధీ నిర్ణయానికి తాను అంగీకరిస్తానని సిద్ధూ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అంతేగాక, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే భగవంత్ సింగ్ మాన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే, చన్నీ సీఎం అభ్యర్థిత్వానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని వర్గం ఎంతవరకు మద్దతునిస్తుందో వేచిచూడాలి.
పంజాబ్‌కు
సీఎం
అభ్యర్థిని
నిర్ణయించేందుకు,
పంజాబ్‌కు
ఎవరు
సీఎంగా
ఉండాలనే
దానిపై
ప్రజల
అభిప్రాయాలను
సేకరించేందుకు
కాంగ్రెస్
సర్వే
నిర్వహించింది.
"చన్నీ,
నవజ్యోత్
సింగ్
సిద్ధూల
మధ్య
ముఖ్యమంత్రి
అభ్యర్థిత్వం
ఎలాంటి
వైరం
రాకుండా
ఉండేందుకు
అభ్యర్థులు,
కార్యకర్తలు,
పార్టీ
ఎంపీల
అభిప్రాయాలు
నమోదు
చేయబడుతున్నాయి"
అని
పార్టీ
వర్గాలు
పేర్కొన్నాయి.