Jharkhand polls: బీజేపీపై రాహుల్ గాంధీ అనాలోచిత విమర్శలు..! బూమరాంగ్ అయ్యాయా ?
వచ్చే నెలలో రెండు దశల్లో జరగబోతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు హద్దులు దాటి పోతున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమికీ, ఎన్డీయేకి మధ్య సాగుతున్న ముఖా ముఖీ పోరులో ప్రత్యర్థులపై రాజకీయ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓ అనాలోచిత విమర్శ చర్చనీయాంశంగా మారింది.
బీజేపీని గిరిజన వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అక్టోబర్ 19న రాంచీలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ.. బీజేపీ గిరిజనుల్ని వనవాసులుగా అభివర్ణిస్తోందని తెలిపారు. అలాగే భారత విద్యావ్యవస్ధలో గిరిజనుల గురించి కేవలం 10-15 లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి బీజేపీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ విద్యావ్యవస్థ కాంగ్రెస్ హయాంలో రూపుదిద్దుకున్నదే అని కాషాయ నేతలు స్పందించారు.

వాస్తవానికి గిరిజన నేతలైన బిర్సా ముండా నుంచి ద్రౌపదీ ముర్ము వరకూ విస్మరించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. కానీ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఆ పార్టీ గిరిజన వ్యతిరేకి అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై సొంత కూటమిలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. బీజేపీ కూడా దీన్ని అందుకుని గిరిజనులకు తాము ఏం న్యాయం చేశామో చెప్పుకోవడం మొదలుపెడితే తిరిగి ఇండియా కూటమే ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి వస్తుందంటున్నారు.












Click it and Unblock the Notifications