పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్‌కు కొత్త ప్రెసిడెంట్?
Recommended Video
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిన కేవలం 52సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. 2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే పెరగడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ తిరస్కరించినా రాహుల్ పట్టు వీడటంలేదని సమాచారం.

రంగంలోకి సీనియర్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుందాని సీనియర్లు నచ్చజెపుతున్నా రాహుల్ గాంధీ మాత్రం రాజీనామా ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు సోమవారం ఆయనతో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ బాధ్యతలు కొత్తవారికి ఇవ్వాల్సిందేనని, అది కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి అయితే బాగుంటుందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోసారి భేటీకానున్న సీడబ్ల్యూసీ
రాహుల్ గాంధీ నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాలుగైదు రోజుల్లో మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొత్త ప్రెసిడెంట్ ఎంపికకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈలోపు నిర్ణయం మార్చుకుంటే రాహుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు. లేనిపక్షంలో సీడబ్ల్యూసీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వస్తున్నాయి.

సోనియా, ప్రియాంకకు అవకాశం
కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు గాంధీ వంశానికి చెందిన వ్యక్తులే ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామా చేసినా అదే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నారు. రాహుల్ నిర్ణయం మార్చుకోని పక్షంలో మరోసారి సోనియా లేదా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications