రైతులకు వెన్నుపోటు పొడిచిన ప్రధాని మోడీ: శ్రీమంతుల కోసం, రాహుల్ గాంధీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రుణమాఫీలు చేయ్యకుండా రైతులను ప్రధాని నరేంద్ర మోడీ వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

రైతులకు పంట బీమా సొమ్ము చెల్లించ లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి రోజుకో ప్రశ్న వేస్తున్న రాహుల్ గాంధీ బీజేపీ నాయకులతో ఆడుకుంటున్నారు.

Rahul Gandhi attack PM Narendra Modi on farmers plight

కాంగ్రెస్‌ పార్టీ వ్యూహంలో భాగంగా గురువారం రైతు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తూ తొమ్మిదో ప్రశ్నను రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ ఏం చేసింది అనే విషయం బహిరంగంగా చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీమంతుల కోసమే పని చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. నిత్యవసర ధరలతో సామాన్యుడు చితికిపోతున్నా కేంద్రం ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతు సమస్యల గురించి ప్రశ్నించే అర్హత రాహుల్ గాంధీకి లేదని బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking forward his question a day campaign, Congress Vice President Rahul Gandhi today targeted Prime Minister Narendra Modi over the problems afflicting the farm sector and farmers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి