Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ లో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.
ఢిల్లీలో పొగ మంచు కారణంగా రాహుల్ గాంధీ విమానం ఆలస్యం కావడంతో.. యాత్ర కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. మణిపూర్ లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజవర్గాల మీదుగా కొనసాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6 వేల 713 కిలోమీటర్లు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగనుంది. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను మార్చి 20 లేదా 21న ముంబైలో ముగుస్తుంది.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీజేపీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలపై రాహుల్ గాంధీ ప్రజలకు వివరించనున్నారు. తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బస్సులతో పాటు అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని వివరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారు.
#WATCH | Congress MP Rahul Gandhi kickstarts Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur. pic.twitter.com/6F8hLDgAqa
— ANI (@ANI) January 14, 2024
"పీఎం మోడీ ఓట్లు అడగడానికి మణిపూర్‌కి వస్తాడు కానీ మణిపూర్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 'వో సమందర్ కే ఊపర్ సైర్ కర్తా ఫిర్తా హై ఔర్ బైతే జగహ్ జప్ కర్తే హే రామ్ రామ్' అని మొహం చూపించడు. ముఖ్ మే రామ్, బగల్ మే చూరీ, ప్రజలతో ఇలా చేయొద్దు. ప్రతి ఒక్కరికి దేవుడిపై నమ్మకం ఉంది కానీ ఓట్ల కోసం ఇలా చేయకండి. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఈ వ్యక్తులు (బీజేపీ) మతాన్ని మిళితం చేస్తున్నారు" అని మల్లికార్జున ఖర్గే అన్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi shares a candid moment with children as he kickstarts Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur.
— ANI (@ANI) January 14, 2024
(Video: Congress) pic.twitter.com/VutoOP3KhU
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications