శివభక్తులం: సోమనాథ్ సంతకంపై బిజెపిని లాగిన రాహుల్
అమ్రేలీ (గుజరాత్): సోమ్‌నాథ్ ఆలయంలో తాను హిందూయేతరుడిగా రిజిస్టర్‌లో సంతకం చేసినట్టు తన మీద వచ్చిన ఆరోపణలపై కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తమది శివభక్తుల కుటుంబమని ఆయన స్పష్టం చేశారు.
మతాన్ని తానెప్పుడూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకోవడం లేదని ఆయన అన్నారు. గురువారం ఆయన గుజరాత్‌లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. సోమ్‌నాథ్ ఆలయంలో తాను సందర్శకుల పుస్తకంలోనే సంతకం చేశానని. ఆ తర్వాత బీజేపీ నేతలు తన పేరును రెండో పుస్తకంలో రాశారని ఆయన చెప్పారు.

గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ తీసుకున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు గుజరాతీలు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు.
వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను, ఇందిరా గాంధీ శివభక్తులమని ఆయన చెప్పారు. మతం తమ వ్యక్తిగతమని అన్నారు.












Click it and Unblock the Notifications