రంగంలో దిగిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఆ పార్టీకి చెందిన వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రెటేరియట్ వేసిన అనర్హత వేటు.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ భగ్గుమంటోన్నాయి. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రమే కాకుండా- ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా రోడ్డెక్కుతున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. రైల్ రోకోలను నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఉద్యమాలను కాంగ్రెస్ అధిష్ఠానం మరింత ఉధృతం చేయబోతోంది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. సత్యాగ్రహ పేరుతో అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ పేరుతో ఆదివారం నిరసన ప్రదర్శనలను చేపట్టనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగనున్నాయి.

 Rahul Gandhi disqualification: Congress to organise a day long Satyagraha on March 26

ఈ మేరకు ఏఐసీసీ నుంచి అన్ని రాష్ట్రాల పీసీసీ, డీసీసీలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, అదాని, పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల అణచివేత, రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. వంటి అంశాలన్నింటిపైనా విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సత్యాగ్రహ ఆందోళన కొనసాగుతుంది.

ఢిల్లీలో మహాత్ముడి విగ్రహం వద్ద ఏర్పాటు కాబోయే కార్యక్రమానికి ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు.. ఇలా అన్ని స్థాయిల్లో నాయకులు సత్యాగ్రహ ఆందోళనల్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బైఠాయిస్తారు. ఇదే తరహాలో ఆందోళనలను ఇక ముందు కూడా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

తమతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకొని వెళ్లనుంది కాంగ్రెస్. తమిళనాడులో డీఎంకే ఇప్పటికే సత్యాగ్రహ ఆందోళనలకు మద్దతు తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ సైతం ఇందులో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్), జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా.. వంటి పార్టీలో కాంగ్రెస్ కు మద్దతుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+