మోడీలో ఓటమి భయం కనిపిస్తోంది..! బీజేపీపై రాహుల్ సెటైర్లు

Recommended Video

    Rahul Gandhi Was Once Again Accused On BJP | Oneindia Telugu

    ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీపై మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం తప్ప దేశాన్ని ఎలా బాగుచేయాలో బీజేపీకి తెలియదని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించడం ఖాయమన్నారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

    రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయం.. ప్రధాని నరేంద్ర మోడీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాహుల్. విభజించి పరిపాలించాలనుకునే ప్లాన్ వర్కవుట్ కావడం లేదనే విషయం.. మోడీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై తనతో మాట్లాడే ధైర్యం మోడీకి లేదన్నారు రాహుల్. గత ఐదేళ్లుగా ఆయనపై పోరాటం చేస్తుండటంతో మోడీ గురించి చాలా విషయాలు అర్థమయ్యాయని తెలిపారు. మోడీతో వాదించడానికి ఎవరైనా సిద్ధమైతే.. ఆయన వెనుదిరిగి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.

    rahul gandhi fires on bjp

    దేశం కన్నా తామే గొప్ప అని భావించే బీజేపీకి.. మరో 3 నెలల్లో దేశమే గొప్ప అనే విషయం బోధపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవస్థలను కాపాడే బాధ్యత అన్నీ పార్టీల మీద ఉందని గుర్తుచేశారు. అవి ఏ ఒక్క పార్టీకో చెందినవి కాదనే విషయం అందరూ తెలుసుకోవాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+