రాహుల్ గాంధీకి ప్రేమతో.. బుగ్గపై ముద్దు.. చెవిలో ఏదో చెప్పబోయి..!

Recommended Video

    రాహుల్ గాంధీని ముద్దాడిన ఆయన అభిమాని| Rahul Gandhi Gets Kissed By Man In Kerala During Wayanad Visit

    తిరువనంతపురం: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన అభిమాని ఒకరు ముద్దాడారు. కేరళలోని వయనాడ్ లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో కూర్చుని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఓ యువకుడు అమాంతం దూసుకొచ్చి, రాహుల్ గాంధీ చెంపపై ముద్దు పెట్టాడు. రాహుల్ గాంధీతో చేతులు కలిపిన వెంటనే ఆ యువకుడు అనూహ్యంగా ఆయన చెంపను ముద్దాడారు. దీని నుంచి రాహుల్ గాంధీ తేరుకునే లోపే.. భద్రత సిబ్బంది అతణ్ని వెనక్కి లాగేశారు.

    మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట చోటు చేసుకున్న వరదల ప్రభావానికి వయనాడ్ పరిధిలోని పలు ప్రాంతాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. అక్కడ కొనసాగుతున్న వరద సహాయక, పునరావాస చర్యలను పరిశీలించడానికి రాహుల్ గాంధీ ఈ ఉదయం వయానాడ్ కు వెళ్లారు. కల్పెట్ట, సుల్తాన్ బథేరీ పట్టణాల్లో పర్యటించారు. కారులో డ్రైవర్ పక్కన ఉన్న సీటులో కూర్చుని బయలుదేరి వెళ్తున్న సందర్భంగా కొందరు పార్టీ అభిమానులు, కార్యకర్తలు చుట్టుముట్టారు.

    Rahul Gandhi gets kissed by man in Kerala during Wayanad visit

    ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. సహాయక, పునరావాస చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమానులతో చేతులు కలుపుతూ కనిపించారు. అదే సమయంలో నీలంరంగు చొక్కా ధరించిన ఓ యువకుడు హఠాత్తుగా కారు వైపునకు దూసుకొచ్చాడు. రాహుల్ గాంధీతో చేతులు కలిపాడు. ఆ వెంటనే- రాహుల్ గాంధీ చెంపను ముద్దాడాడు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో రాహుల్ కాస్త ఇబ్బంది పడటం కనిపించింది. దీన్ని గమనించిన వెంటనే ఆయన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని వెనక్కి లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    నిజానికి- ఇలా బహిరంగ ప్రదేశాలు, ప్రదర్శనల్లో రాహుల్ గాంధీని అభిమానులు ముద్దాడటం కొత్తేమీ కాదు. ఇదివరకు రెండుసార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఒకరు ఎన్నికల ప్రచార వేదిక మీదే రాహుల్ ను ముద్దాడారు. అంతకుముందు- 2014లో పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యక్తి రాహుల్ ముద్దాడిన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా- అదే జాబితాలో ఈ సారి కేరళ చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+