వాయనాడులో రాహుల్: విషం చిమ్ముతున్న ప్రధానిపై పోరాటం చేస్తున్నా

వాయనాడు: కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. లోక్‌సభ‌ ఎన్నికల తర్వాత తొలిసారిగా వాయనాడ్‌లో రోడ్ షో నిర్వహించారు. వాయనాడులో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్‌షో సందర్భంగా ఆయన ప్రధాని మోడీ మరోసారి అటాక్ చేశారు. జాతీయ స్థాయిలో తాము ఒక విషంతో పోరాడుతున్నామని అన్నారు. మోడీ నాటిని విషంపై పోరాడుతున్నట్లు చెప్పారు. తాను చాలా కఠినమైన పదం వినియోగిస్తున్నానని చెప్పిన రాహుల్ గాంధీ... మోడీ దేశాన్ని విభజించేందుకు విషం నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల్లో వైషమ్యాలను పెంచి వారి మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు చౌకీదార్ చోర్‌ అనే నినాదం చేశారు. ఇక మోడీ విద్వేషాలు సృష్టించాలని చూస్తూ తామంతా ప్రేమతో వాటిని ఎదుర్కొందామని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ విద్వేశం, అభద్రతా భావం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారని రాహుల్ అన్నారు. ఎన్నికల తర్వాత చౌకీదార్ చోర్ హై తను తొలిసారిగా వింటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తాను చెందినప్పటికీ ఆ పార్టీలో ప్రతిఒక్కరికీ తలపులు తెరిచే ఉంటాయన్నారు. వాయనాడు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే తన కర్తవ్యం అని చెప్పిన రాహుల్ గాంధీ... వారి కష్టాలనుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు.

Rahul Gandhi in Wayanad, Thanks people for electing him

తన ప్రచారంలో మోడీ విషం చిమ్ముతారని చెప్పిన రాహుల్ గాంధీ విద్వేషాల ద్వారా ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో గెలిచేందుకు మోడీ అబద్ధాలను ప్రయోగిస్తారని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రేమ సత్యం వెంట నిలిచిందని అన్నారు. నరేంద్ర మోడీపై తన పోరాటం ఆగదని చెప్పిన రాహుల్ గాంధీ ఆయన ప్రతి చర్యను ప్రేమతోనే ఎదుర్కొంటానని వెల్లడించారు. ఇదిలా ఉంటే కేరళలోని గురువాయుర్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి వెళ్లి తిరుమలేశుడిన మోడీ దర్శించుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+