55 రోజుల తర్వాత రాహుల్ గాంధీ వచ్చేస్తున్నాడట..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులుఎక్కడికి వెళ్లినా వారికి ఎదరౌతున్న ఒకే ఒక ప్రశ్న యువరాజు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు అని. సమాధానం చెప్పలేక నాయకులు మీడియా మీద అసహనం వ్యక్తం చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా మొదట మీ నాయకుడు రాహుల్ ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని తమ మీద విమర్శలు చెయ్యాలని కాంగ్రెస్ నాయకుల మీద మండిపడుతున్నారు. ఎట్టకేలకు రాహుల్ గాంధీ సుమారు రెండు నెలలకు (55 రోజులకు) దర్శనం ఇవ్వనున్నారు.

ఏప్రిల్ 15వ తేదిన రాహుల్ ఢిల్లీ రానున్నారని మంగళవారం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నాయకుడు ఏ.కే.అంటోని అన్నారు. మీరు ఇక్కడికి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చారు. పదే పదే రాహుల్ గురించి ఎందుకు ప్రశ్నిస్తారని మీడియాపై అసహనం ప్రదర్శించారు.
విశ్రాంతి తీసుకున్న రాహుల్ ఈ నెల 15వ తేది మీ ముందుకు వస్తారని ఆంటోని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రవేశ పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈనెల 19వ తేదిన ఢిల్లలో రైతులతో నిరసన ర్యాలి, ధర్నా నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జరిగే రైతు ర్యాలిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గోంటాడని, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications