Rahul Gandhi: అదానీని ప్రశ్నిస్తే కేంద్రం అటాక్-జోడో యాత్ర ఎన్నో నేర్పింది-రాహుల్ కామెంట్స్

పార్లమెంటులో అదానీ అక్రమాలపై ప్రశ్నిస్తే.. మంత్రులు, ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని రాహుల్ గాంధీ ఇవాళ కాంగ్రెస్ ప్లీనరీలో ఆరోపించారు.

ఛత్తీస్ ఘడ్ రాజధాని నయా రాయ్ పూర్ లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ జరుగుతోంది. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర సీనియర్లు, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ ప్లీనరీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ మూడవ రోజు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై రాహుల్ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాని, జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న లాల్ చౌక్‌లో రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. తాము ప్రజల్లో జెండా స్ఫూర్తిని నింపామని, మీరు ఆ స్ఫూర్తినే జనానికి దూరం చేశారని విమర్శలు గుప్పించారు. జనం హృదయాలలో ఈ ఫీలింగ్ తెచ్చామన్నారు. గతంలో మోడీ కూడా లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం ఎగరేశారని, కానీ తాను జెండా ఎగరేయడానికీ, దానికీ మధ్య తేడా మాత్రం ఆయనకు అర్ధం కాలేదన్నారు.

 rahul gandhi key comments in cong plenary- says centre targets me for questioning adani

మరోవైపు.. పార్లమెంట్‌లో అదానీకి బీజేపీ నేతలు ఎందుకు రక్షణగా నిలిచారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గౌతమ్‌ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కటేనని రాహుల్ ఆరోపించారు. తాను పార్లమెంటులో గౌతమ్ అదానీని విమర్శించానని, ప్రధాని మోడీతో ఆయనకేం సంబంధమని అడిగానన్నారు. దీనికే ప్రభుత్వం, మంత్రులు ఆయన్ను రక్షించేందుకు రంగంలోకి దిగారన్నారు. పార్లమెంటులో అదానీ గురించి ఎవరూ ప్రశ్నలు అడగలేరని, నిజం బయటకు వచ్చే వరకు తాము ప్రశ్నలు అడుగుతూనే ఉంటామన్నారు.

 rahul gandhi key comments in cong plenary- says centre targets me for questioning adani

మరోవైపు తాను ఈ మధ్యే విజయవంతంగా పూర్తి చేస్ిన భారత్ జోడో యాత్ర గురించి కూడా రాహుల్ ప్లీనరీలో మాట్లాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తాను దేశం కోసం నడిచానని, యాత్రలో తనకు, పార్టీకి వేలాది మంది కనెక్ట్ అయ్యారని రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. తాను రైతుల సమస్యలను విన్నానని, వారి బాధలను తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు. 52 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తనకు ఇల్లు లేదని, కానీ కాశ్మీర్‌కు చేరుకున్నప్పుడు అదే తన ఇల్లులా కనిపించిందన్నారు. అన్ని కులాలు, వయోవర్గాల ప్రజలు తమ ఇంటిలో ఉన్నారని భావించేలా ఈ యాత్ర సాగిందన్నారు. యాత్రలో ప్రజలు తనతో రాజకీయ విషయాల గురించి మాట్లాడలేదని, కానీ తాను కాశ్మీర్‌కు చేరుకున్నప్పుడు అంతా మారిపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+