న్యాయం చేస్తాం.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. ఆల్వార్ అత్యాచార బాధితురాలికి రాహుల్ భరోసా..
ఆల్వార్ : రాజస్థాన్ ఆల్వార్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ అంశానికి నాయకులు రాజకీయ రంగుపులుముకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సీఎం అశోక్ గెహ్లాట్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో కలిసి బాధితురాలి ఇంటికెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాదిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. రాజకీయ లబ్ది కోసం ఇక్కడకు రాలేదని స్పష్టంచేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని అన్నారు. 'ఘటన గురించి తెలిసిన వెంటనే అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడాను. ఇది రాజకీయ అంశం కాదు. బాధిత కుటుంబాన్ని కలిశాను, వారికి తప్పకుండా న్యాయం చేస్తాను. దోషులను కఠినంగా శిక్షిస్తామ'ని రాహుల్ స్పష్టం చేశారు.

ఏప్రిల్ 26న ఆల్వార్ సమీపంలో ఆరుగురు దుండగులు దళిత మహిళపై భర్త ఎదుటే సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఒకరు అత్యాచార దృశ్యాలను వీడియో తీసి సర్క్యూలేట్ చేశాడు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయగా... పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించారు. దీనిపై దుమారం రేగడంతో ఎట్టకేలకూ మే 2న ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications