అల్వార్ గ్యాంగ్‌రేప్ మహిళకు న్యాయం జరుగుతుంది.. రాహుల్ గాంధి

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్థాన్‌లోని ఆల్వార్ అత్యాచారానికి గురైన భాదిత మహిళను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ గాంధి రాష్ట్ర్ర సీఎం అశోక్ గెహ్లాట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా బాధితురాలికి తగిన న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

Rahul Gandhi meets the Alwar gang-rape survivor

కాగా జరిగిన సంఘటన పై ప్రధాని మోడీ చేసిన విమర్శలపై రాహుల్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు వచ్చానని చెప్పారు. ఈనేపథ్యంలోనే భాదితురాలితో పాటు ఆమే కుటుంభానికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

గత నెల 26న టూవీలర్ పై వెళుతున్న భార్యభర్తలను అడ్డగించి ఆరుగురు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఇసుక క్వారీల్లోకి తీసుకెళ్లి, భర్తముందే 18 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ఈనేపథ్యంలోనే అత్యాచారం ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ నేరుగా ప్రస్థావించారు. రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుపలుకుతున్న మాయవతిపై ఆయన విరుకుచుకు పడ్డారు.

మాయవతి దళితుల హక్కులను కాపాడడంలో ముసలి కన్నీరు కారుస్తుందని యూపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కాగా రాజస్థాన్ లో ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు మాయవతికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు ప్రధాని నరేంద్రమోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+