రాహుల్! నాకూ బాసే, ఎలాంటి సందేహం లేదు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ తనకు కూడా బాసేనని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఇందులో తమకు ఎలాంటి సందేహం లేదని ఆమె గురువారం జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో చెప్పారు.
Recommended Video

Parliament Proceedings : Disruptions by TDP MPs in both Houses
సోనియా గాంధీ గత 19ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ లోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

'అతను(రాహుల్ గాంధీ) నాకు కూడా బాస్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను అధ్యక్షురాలి ఉన్నప్పుడు ఎలాగైతే నిబద్ధతో పనిచేశారో.. అతని నాయకత్వంలో కూడా అలానే నడుచుకోవాలి' అని సోనియా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications