Rahul Gandhi: పార్లమెంట్ అంటే అహం అనే ఇటుకలతో నిర్మించిన భవనం కాదు.. రాజ్యాంగ విలువలతో నిర్మించిన దేవాలయం..
కొత్త పార్లమెంటు భవనాన్ని దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును చేత కాకుండా ప్రధాని మోడీ చేత ప్రారంభించేందుకు ఏర్పాటు చేయడంపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కొత్త పార్లమెంట్ ను దేశ ప్రథమ పౌరురాలి చేత కాకుండా ప్రధాని చేత ప్రారంభించడం దారుణమని అన్నారు. ఇది దేశ అధ్యక్షురాలిని అవమానపరిచినట్లేనని చెప్పారు.
తీసుకురావడం లేదా ఆమెను వేడుకకు ఆహ్వానించడం దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. పార్లమెంట్ ను అహం అనే ఇటుకలతో నిర్మించలేదని, రాజ్యాంగ విలువల నిర్మించారని చెప్పారు. పార్లమెంట్ రాజ్యాంగ విలువలతో నిర్మించిన దేవాలయంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం నిర్వహించకపోవడం, ఈ వేడుకలకు ఆమెను ఆహ్వానించకపోవడం.. కచ్చితంగా రాజ్యాంగ అధినేతను అవమానించడమేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

మే 28 కొత్త పార్లమెంట్ భవనాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్, టిఎంసి, ఆప్ సహా 19 ప్రతిపక్షాలు బుధవారం నిర్ణయించాయి. బహిష్కరణకు గల కారణాలను వివరిస్తూ ప్రతిపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశ అధ్యక్షురాలు ముర్మును పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయం ఘోర అవమానంగా అభివర్ణించాయి. ఇది మన ప్రజాస్వామ్యంపై దాడి భావిస్తున్నామని తెలిపాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), జనతాదళ్ (యునైటెడ్), ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (UBT), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సమాజ్‌వాదీ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, విడుతలై చిరుతైగల్ కట్చి, మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కజగం, రాష్ట్రీయ లోక్ దళ్ ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications